Smart watch: ఈరోజుల్లో స్మార్ట్ వాచ్ లవ్ వినియోగం బాగా పెరిగింది. ఒకప్పుడు వాచ్ అంటే కేవలం సమయం చూడడానికి మాత్రమే కానీ ఇప్పుడు మాత్రం రకరకాల ఫీచర్లతో కొత్త వాచ్లు వస్తున్నాయి చాలామంది కొత్త కొత్త బ్రాండెడ్ వాచ్లను కొనుగోలు చేస్తున్నారు ముఖ్యంగా స్మార్ట్ వాచ్ లకు డిమాండ్ బాగా పెరిగింది. స్మార్ట్ వాచ్ కొనుగోలు చేసే ముందు కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అప్పుడే వాచ్ కొనుగోలు చేయండి లేదంటే అనవసరంగా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. డిస్ప్లే ముఖ్యమైనది. సన్ లైట్ లో కూడా స్క్రీన్ బెటర్ గా బ్రైట్ గా కనపడడానికి చూసుకోవాలి. ఎల్సిడి డిస్ప్లే కు బదులుగా ఓఎల్ఈడి మీద డిస్ప్లేను కలిగి ఉన్న వాచ్ ని కొనుగోలు చేయండి.

Check these before buying Smart watch

దీంతో సూర్య కిరణాలు పడినా కూడా కనబడుతుంది. స్మార్ట్ వాచ్ లుక్స్ తో పాటుగా వేగం కూడా ముఖ్యమైనది. వాచ్ వేగాన్ని నిర్ణయించేది ఆపరేటింగ్ సిస్టం. ఆపరేటింగ్ సిస్టం విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి గూగుల్ వేర్ ఆపరేటింగ్ సిస్టం సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్తున్నారు అలానే రక్షణ విషయాను కూడా పరిగణలోకి తీసుకోవాలి పొరపాటున చేతి నుండి జారి కింద పడితే స్క్రీన్ డామేజ్ అవుతుంది కాబట్టి గొర్రెల క్లాస్ ప్రొటెక్షన్ ఉన్నదని తీసుకోండి అప్పుడు డామేజ్ అవ్వదు.

Also read: AP: పంచాయతీ రాజ్ వ్యవస్థలో మార్పులు..!

అలానే బ్యాటరీకి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ఎక్కువ కాలం చార్జింగ్ ఇచ్చే వాచ్ లకు ప్రాధాన్యత ఇవ్వాలి అందుకే వాచ్ కొనుగోలు చేసే సమయంలో బ్యాటరీ సామర్థ్యాన్ని కూడా చూసుకోవాలి. స్మార్ట్ వాచ్ లో చూడాల్సిన ఇంకో అంశం ఫిట్నెస్ ఫీచర్స్. హెల్త్ పరంగా అన్ని రకాల ఫీచర్స్ ఉన్నాయా లేదా అనేది చూసుకోండి ఎక్కువ హెల్త్ ఫీచర్స్ ఉన్న వాచ్ కి ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. ఇలా మీరు వాచ్ కొనుగోలు చేసేటప్పుడు కచ్చితంగా వీటిని చూసి కొనుగోలు చేయండి లేకపోతే అనవసరంగా తర్వాత ఇబ్బంది పడాల్సి ఉంటుంది (Smart watch).