Star hero Divorce.. wedding photos deleted

Divorce: విడాకులు..విడాకులు.. విడాకులు.. ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా చిన్నచిన్న మనస్పర్ధలకే విడాకులు తీసుకుంటున్నారు చాలామంది పెద్దపెద్ద సెలబ్రెటీలు. అది కూడా పేరున్న వాళ్ళు కావడంతో ఈ మ్యాటర్ ని అంత తొందరగా మరిచిపోలేకపోతున్నారు కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా.. అయితే తాజాగా మరో స్టార్ హీరో కూడా విడాకులు తీసుకోబోతున్నట్టు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది..

Star hero Divorce.. wedding photos deleted

ఈమధ్య విడాకులు తీసుకోవడం లేదు కలిసే ఉంటున్నారు అంటూ ఒక పోస్ట్ వైరల్ అవ్వగా..సడన్ గా మరో న్యూస్ ఫిలిం సర్కల్స్ నుండి వినబడుతోంది.మరి ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు.. నిజంగానే భార్యతో విడిపోబోతున్నారా.. అనేది ఇప్పుడు చూద్దాం.. కోలీవుడ్ హీరోలలో పాపులర్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న రవి అందరికీ తెలిసే ఉంటారు. ఈయన రవి కంటే జయం రవిగా ఎక్కువ ఫేమస్ అయ్యారు. ( Divorce)

Also Read: Sunitha: సింగర్ సునీత అంటే ఆ స్టార్ యాంకర్ కి ఎందుకంత కోపం.. అమెరికాలో ఆ రాత్రి ఏం జరిగింది.?

అయితే అలాంటి రవి ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్య ఆర్తికి విడాకులు ఇవ్వబోతున్నారంటూ కోలీవుడ్ మీడియాలో ఓ టాక్ వినిపిస్తోంది. మరి ఇంతకీ ఇది నిజమేనా..అనేది చూస్తే..రీసెంట్ గా ఆర్తి, జయం రవి ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ రూమర్ వినిపించగా.. అందులో ఎలాంటి నిజం లేదు అన్నట్లుగా జయం రవి హీరోగా చేసిన జయం మూవీ కి సంబంధించిన పోస్టర్ షేర్ చేసి ప్రేమ అంటే మాటలు కాదు ఒక జీవితం అంటూ ఓ క్యాప్షన్ పెట్టింది.

 Star hero Divorce.. wedding photos deleted

దీంతో ఈ జంట డివోర్స్ తీసుకోవడం లేదని అందరూ ఓ క్లారిటీకి వచ్చారు. అయితే తాజాగా కోలీవుడ్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఆర్తి తన సోషల్ మీడియా ఖాతాలో ఉన్న తమ పెళ్లికి సంబందించిన ఫొటోస్ డిలీట్ చేసిందట.ఇక పెళ్లి ఫొటోస్ డిలీట్ తో ఈ జంట విడాకుల వార్తలు మరింత ఊపందుకున్నాయి.మరి నిజంగానేపెళ్లి ఫోటోలు డిలీట్ చేసిందా లేదా ఆర్కైవ్ చేసిందా అనేది తెలియాల్సి ఉంది.( Divorce)