Kalki 2898 AD: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘కల్కి 2898 ఏడీ. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాని తెరకెక్కించారు. రూ. 600 కోట్ల అత్యంత భారీ బడ్జెట్ తో అశ్విని దత్ గ్రాండ్ గా ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమాని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ మొత్తం కలిపి నాలుగు వేలకు పైగా థియేటర్స్ లో గ్రాండ్గా మేకర్స్ రిలీజ్ చేశారు. Kalki 2898 AD

A director who made a Rs 600 crore film turned around with worn sandals

అలాగే ఈ సినిమా విదేశాల్లోనూ దాదాపు 4500కు పైగా థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇక ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ సినిమాని ఎవరు టచ్ చేయని విధంగా కొత్త కాన్సెప్ట్ తో నాగ్ అశ్విన్ ఈ సినిమాని తెరకెక్కించారు. హాలీవుడ్ రేంజ్ విజువల్స్ తో ట్రైలర్స్ ఉండడం వంటి పలు అంశాలతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా దాదాపు నాలుగున్నర ఏళ్లపాటు షూటింగ్ తీశారు. ఇక ఈ సినిమాలో దీపికా పదుకొనే, దిశా పటాని, శోభన, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ లో నిర్మించారు. Kalki 2898 AD

Also Read: Kalki 2898 AD: ‘కల్కి 2898 ఏడీ’లో గెస్ట్ రోల్స్ లిస్ట్ పెద్దదే..ఊహించని పేర్లు?

నారాయణ సంగీతం అందించారు. మొత్తానికి ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది. ఈ సినిమా విడుదలకు ముందే రాత్రి నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా సృష్టించారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కల్కి గురించే చర్చ నడుస్తోందని చెప్పవచ్చును. అంతేకాకుండా కల్కి ట్యాగ్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. ముక్కలుగా ఊడిపోయి…. అరిగిపోయిన తన చెప్పుల ఫోటోలను షేర్ చేసుకుంటూ ఇన్ స్టాలో ఆసక్తికర పోస్ట్ చేశారు. Kalki 2898 AD

చాలా దూరం నడిచా… ఇక్కడికి దాకా రావడానికి అని అర్థం వచ్చేలా క్యాప్షన్ జత చేశారు. అంటే ఈ సినిమా కోసం నాగ్ అశ్విన్ ఎంతో కష్టపడినట్లు పరోక్షంగా తెలిపారు. ఇక ఇటీవల విడుదలైన ఫ్రీ లూడ్ వీడియోలోనూ ఈ సినిమా కోసం ఐదేళ్లు కేటాయించానని నాగ్ అశ్విన్ చెప్పారు. ఇక ఈ పోస్ట్ చూసిన చాలామంది నెటిజెన్స్…. ఇప్పుడు ఆ కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చిందంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక మరికొందరేమో రూ. 600 కోట్ల బడ్జెట్ తో సినిమాను తీసిన దర్శకుడు అరిగిన చెప్పులతో తిరిగాడా ఇదంతా ఫేక్ పోస్ట్ అంటూ పలు రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. Kalki 2898 AD