Akira Nandan: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఈ హీరో నటించిన తాజా చిత్రం కల్కి 2898 ఏడీ. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. దాదాపు నాలుగున్నర ఏళ్ల పాటు ఈ సినిమా షూటింగ్ ని అద్భుతంగా తీశారు దర్శకుడు నాగ్ అశ్విన్. ప్రభాస్ మోస్ట్ ప్రెస్టేజియస్ మూవీ కల్కి నేడు థియేటర్స్ లో విడుదలైంది. ఈ సినిమాని పురాణాలు, ఇతిహాసాల ఆధారంగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించారు. Akira Nandan

Deputy CM Pawan Kalyan Son Akira Nandan Watching On Kalki 2898 Movie

విష్ణుమూర్తి 10వ అవతారంగా భావించే కల్కి అవతారాన్ని ఈ సినిమాలో చూపించాడు. డైరెక్టర్ ఈ సినిమాను రూ. 600 కోట్ల భారీ బడ్జెట్ తో హైటెక్నికల్ వాల్యూస్ తో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాగా…. అర్ధరాత్రి నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్స్ వద్ద హంగామా మొదలుపెట్టారు. భారీ కటౌట్స్, డప్పులతో సందడి చేస్తూ హంగామా సృష్టించారు. ఇక కల్కి 2898 ఏడీ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించగా….కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపిక పదుకొనే, దిశా పటాని, మాళవిక నాయర్, శోభన కీలక పాత్రల్లో నటించారు. Akira Nandan

Also Read: Kalki 2898 AD OTT Release Date: కల్కి ఓటీటీ పార్టనర్ ఫిక్స్..ఎందులో స్ట్రీమింగ్ అంటే?

ఇక ఈ సినిమా విడుదలకు కేవలం కొన్ని గంటల ముందు మాత్రమే ఇందులో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ సైతం ఈ సినిమాలో నటించినట్లు అధికారికంగా పోస్టర్స్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఇక ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ ఫ్యాన్స్ వీక్షిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాని ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు కొంతమంది సినీ సెలబ్రిటీలతో పాటు, రాజకీయ నాయకులు కూడా చూస్తుండడం గమనార్హం. ఈ క్రమంలోనే కల్కి 2898 ఏడీ సినిమాను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా నందన్ చూడడం విశేషం. Akira Nandan

హైదరాబాదులోని ప్రసాద్ ఐమాక్స్ లో అతడు ఈ చిత్రాన్ని వీక్షించాడు. అకిరా నందన్ కల్కి 2898 ఏడీ టీ షర్టు ధరించి మరి ఈ సినిమాను చూసేందుకు రావడం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అకిరా ఈ సినిమాని చూడడానికి వెళ్తున్నప్పటి ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రభాస్ చిత్రాన్ని చూసేందుకు అకిరా రావడంతో ఇటు ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు, మెగా ఫ్యాన్స్ కూడా ఈ విషయం తెలిసి సంబరాలు చేసుకుంటున్నారు. Akira Nandan