Kalki 2898 AD: కల్కి సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని అంతా అంటున్నారు ఇప్పటికే కల్కి గురించి అందరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ప్రభాస్ లేటెస్ట్ మైథాలజికల్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కల్కి 2898 ఏడి ఈరోజు థియేటర్లలో సందడి చేస్తోంది. ఇప్పటికే పాలు చోట్ల ప్రీమియర్ షోలు వేశారు. నేటిజన్లు ఈ సినిమాకి ఫుల్ ఫిదా అయిపోతున్నట్లు తెలుస్తోంది. అతి భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా షోలు ఉదయం 5 గంటల నుండి మొదలయ్యాయి.

Kalki 2898 AD USA premiere first report

ఈపాటికి చాలా చోట్ల ప్రీమియర్ షోలు పడిపోయాయి. యుఎస్ఏ ప్రీమియర్ రిపోర్ట్ గురించి ఇప్పుడు చూసేద్దాము. కేవలం భారతదేశం లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో కల్కి సినిమా విడుదల అయింది. మొదటి పార్ట్ విషయానికి వస్తే మహాభారత ఎపిసోడ్ ని అద్భుతంగా తెరమీదకు తీసుకువచ్చారు ప్రభాస్ ఫన్నీగా ఉండే పాత్రని చాలా రోజులకి చేశారు. అమితాబ్ బచ్చన్, కమల్ హసన్, దీపిక పదుకొనే పాత్రలు కూడా సినిమాకు హైలెట్ అయ్యాయి.

Also read; Kalki: ప్లీజ్ అటువంటివి చేయవద్దు.. ఫ్యాన్స్ ని రిక్వెస్ట్ చేస్తున్న కల్కి మేకర్స్.. కారణం ఇదే..!

ఇంటర్వెల్ ఎపిసోడ్ కానీ సెకండ్ హాఫ్ కానీ అద్భుతంగా ఉన్నాయి. హాలీవుడ్ రేంజ్ లో విజువల్స్ ఉన్నాయని ప్రేక్షకులు అంటున్నారు. మొదటి పార్ట్ తో కంపేర్ చేస్తే రెండో పార్ట్ కాస్త ఎక్కువ ప్రభావితంగా కనపడిందని క్లైమాక్స్ అద్భుతంగా ఉందని, నాగ్ అశ్విన్ బాగా మూవీ తీసుకొచ్చారని ప్రేక్షకులు అంటున్నారు. అలాగే క్లైమాక్స్ పార్ట్ కూడా బాగా తీసుకువచ్చినట్లు ఇండియన్ సినిమాలో గొప్ప క్లైమాక్స్ ఇది అని చాలామంది అంటున్నారు. కల్కి సినిమాటిక్ యూనివర్స్ అద్భుతంగా తీసుకొచ్చారని సినిమాలోని అన్ని పాత్రల్ని కూడా అద్భుతంగా చూపించారని అన్నారు (Kalki 2898 AD).

Kalki 2898 AD: Everyone's eyes are on Kalki