Kalki Audience Review: పాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ రాంపేజ్ మొదలైందని ఎన్ఆర్ఐ అండ్ అమెరికా ఆడియన్స్ మరియు సోషల్ మీడియా లోకం స్పష్టంగా తెలియజేస్తుంది. డార్లింగ్ హీరో గా నాగ్ అశ్విన్ డైరెక్షన్లో రూపొందిన సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి. ఈ సినిమా ఓవర్సీస్ నుంచి సూపర్ డూపర్ టాక్ అందుకుంది. వైజయంతి మూవీస్ పతాకంపై సుమారు 600 కోట్ల నిర్మాణంతో రూపొందిన ఈ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ అంచనాలు అందుకోవడం ఖాయమని అమెరికాలో ప్రీమియర్ షోస్ నుంచి వచ్చే రిపోర్ట్ చూస్తుంటే అర్థమవుతుంది.

ఇక నేడు అనగా జూన్ 27వ తారీఖున రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల దగ్గర నుంచి ఏ విధమైన టాక్ అందుకుంటుందో చూద్దాం. కల్కి సినిమాలో మొదటి 30 నిమిషాలు మహాభారతం ఎపిసోడ్ వస్తుందని ఓ నెటిజన్ తెలిపారు. అదేవిధంగా ప్రతి ఫ్రేమ్ అండ్ ప్రతి షాట్ అద్భుతంగా ఉందని వెల్లడించారు. ఒక డివైన్ ఫీలింగ్ వచ్చిందని అన్నారు. అసలు ఆ 30 నిమిషాలు సలార్ సినిమా కంటే ఎన్నో రెట్లు ఎక్కువ అని చెప్పాడు మరో నెటిజన్. ఇక మరికొందరు అయితే.. ఇప్పటివరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ప్రేక్షకులు చూడనటువంటి విజువల్స్ అండ్ సెటప్ కల్కి లో ఉన్నాయని చెబుతున్నారు. స్టోరీ లైన్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉందని అతడు తెలిపాడు.

ఫస్ట్ ఆఫ్ వరకు ప్రభాస్ క్యారెక్టర్ స్క్రీన్ సస్పెన్స్ గా ఉంటుందని ఆయన రోల్ చాలా బాగుందని అన్నాడు. ఇక కల్కి సినిమా ఫస్ట్ ఆఫ్ అంతటికి ఇంటర్వెల్ బ్రేక్ హైలెట్ అవుతుందని అమెరికా నుంచి ఓ నెటిజన్ పేర్కొన్నాడు. విశ్రాంతి వరకు వచ్చే సినిమాలో స్క్రీన్ ప్లే ఏమి అంత గొప్పగా లేదని విజువల్స్ అండ్ హైలెట్స్ మాత్రం అదిరిపోయాయని అన్నారు.

ఇక మరో నెటిజన్ వచ్చేసరికి.. కల్కి సినిమాలో సూపర్ కార్ బుజ్జిని పరిచయం చేయడం కోసం స్పెషల్ ఈవెంట్ చేశారు. ఆ కార్ కి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారనేది ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. బుజ్జి తో ప్రభాస్ కెమిస్ట్రీ అదిరిపోయిందని తెలిపారు ఆ నెటిజన్. అలా మొత్తానికి అయితే ప్రభాస్ సినిమాకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ఏ వస్తుంది.(Kalki Audience Review)