Kalki hit the Salar bookings

Kalki 2898 AD Twitter Review: ప్రభాస్ లేటెస్ట్ మైథాలజికల్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కల్కి 2898 AD ఈరోజు థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే పలు చోట్ల ప్రదర్శించబడిన ప్రీమియర్ షోలు చాలామంది చూసారు. నెటిజెన్స్ సినిమా ఎలా ఉందో ట్విట్టర్ రివ్యూ లో చెప్పారు ఎప్పటి నుండో ప్రభాస్ ఫ్యాన్స్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. అతి భారీ అంచనాలతో రానున్న ఈ సినిమా షోలు ఉదయం 5 గంటల నుండి మొదలయ్యాయి ఈ పాటికి పలు చోట్ల ప్రీమియర్ షోలు పడిపోయాయి. అవి చూసిన వారు సినిమా ఎలా ఉందో చెప్పారు. మరి ఇక ట్విట్టర్ రివ్యూ చూద్దాం.

Kalki 2898 AD Twitter Review

కల్కి సినిమాలో యానిమేషన్ సూపర్ గా ఉందని ఆడియన్స్ అంటున్నారు ప్రభాస్ లుక్ అయితే అదిరిపోయిందని బుజ్జి రోల్ చాలా బాగుందని అంటున్నారు. అంతేకాకుండా కల్కి కాదు బుజ్జి అండ్ భైరవ సూపర్ హిట్ మూవీ అనే ప్రేక్షకులు అరుస్తూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినిమా చాలా బాగుందని అంటున్నారు. ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉందని స్టోరీ లైన్ అసలు హైలెట్ గా ఉందని వీఎఫెక్స్ అదిరిపోయాయని బ్లాక్ బస్టర్ మూవీ అని అంటున్నారు.

Also read: Annapoornamma: ఛాన్స్ ఇస్తా కోరిక తీర్చమనేవారు.. ఎయిడ్స్ రావడంతో భయపడిపోయారు.!

అంతేకాకుండా ప్రభాస్ ఎంట్రీ సీన్ అదిరిందని కాకపోతే 20 నిమిషాల తర్వాత ఉండి గూస్ బంప్స్ తెప్పించేలా ఉందని అన్నారు. అలాగే ఈ సినిమా యావరేజ్ గా ఉందని మరికొందరు చెప్తున్నారు కానీ సినిమాలో బెస్ట్ యాక్షన్స్ వీఎఫ్ఎక్స్ ఉన్నాయని అన్నారు మంచి బిజినెస్ చేస్తుందని, స్టార్స్ అద్భుతంగా నటించాలని వారు చెప్తున్నారు అమితాబచ్చన్ యాక్షన్ సీన్స్ భారీగా ఉన్నాయని దీపికా ప్రభాస్ అదరగొట్టేసారని ఒకరు తెలిపారు. ఇండియాలో ఏ హీరో తట్టుకోలేడని సలార్ కూడా పనికిరాదని పలువురు ఫ్యాన్స్ చెప్తున్నారు. ప్రభాస్ లుక్స్ బాగున్నాయని ప్రభాస్ ఫ్యాన్స్ సాటిస్ఫై అయ్యే విధంగా సినిమా ఉందని ఒక ప్రేక్షకుడు చెప్పాడు. విజువల్స్ ఓ రేంజ్ లో ఉన్నాయని డైరెక్షన్ అదిరిపోయింది అని మరికొందరు చెప్పారు (Kalki 2898 AD Twitter Review).

Kalki hit the Salar bookings