Mrunal Thakur who did that work for free for Vyjayanthi banner

Mrunal Thakur: మృణాల్ ఠాకూర్.. సీతారామం మూవీతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన గ్లామరస్ బ్యూటీ.. ఈ సినిమాలో సీతగా కనిపించి ఎంతోమందిని తన అందంతో కట్టిపడేసింది. అయితే ఆ తర్వాత ఈమె గ్లామరస్ పాత్రలు చేయడం కొంతమంది అభిమానులను హర్ట్ చేసినప్పటికీ సినీ ఇండస్ట్రీ లో ఇవన్నీ కామన్ కాబట్టి మోడ్రన్ సీత గా సర్దుకుపోతున్నారు.ఇక ఈ హీరోయిన్ సీతారామం మూవీ తో ఇండియా వైడ్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించింది.

Mrunal Thakur who did that work for free for Vyjayanthi banner

ఆ తర్వాత వచ్చిన హాయ్ నాన్న మూవీ కూడా మృణాల్ కెరీయర్ ని మరింత ముందుకు తీసుకువెళ్లింది. అయితే ఆ మధ్యకాలంలో వచ్చిన ఫ్యామిలీ స్టార్ సినిమా కాస్త బెడిసి కొట్టినప్పటికీ మృణాల్ ఠాకూర్ కి బాలీవుడ్ లో, టాలీవుడ్లో అవకాశాలు మాత్రం భారీగానే వస్తున్నాయి. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తున్నట్టు టాక్. అయితే తాజాగా విడుదలైన కల్కి సినిమాలో ఈమె గినియా అనే పాత్ర పోషించింది.(Mrunal Thakur )

Also Read: Kalki 2898 AD: ‘కల్కి 2898 ఏడీ’లో గెస్ట్ రోల్స్ లిస్ట్ పెద్దదే..ఊహించని పేర్లు?

అయితే ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ గెస్ట్ రోల్ లో నటించింది. అలాగే సినిమా మొదట్లోనే మృణాల్ ఠాకూర్ పాత్ర ఉంటుంది. అయితే తాజాగా మృణాల్ ఠాకూర్ గురించి ఒక వైరల్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. అదేంటంటే..కల్కి సినిమాలో గెస్ట్ రోల్ చేయడం కోసం మృణాల్ ఠాకూర్ ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదంటూ టాక్ వినిపిస్తోంది.దానికి ప్రధాన కారణం ఏంటంటే.. సీతారామం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది వైజయంతి మూవీస్ బ్యానర్ మీదనే..

Mrunal Thakur who did that work for free for Vyjayanthi banner

అలా తనకు లైఫ్ ఇచ్చిన వైజయంతి బ్యానర్ కోసం ఫ్రీగా ఈ పని చేసి వారి రుణం తీర్చుకోవాలి అనే ఉద్దేశంతోనే వైజయంతి మూవీస్ బ్యానర్ లో వచ్చిన కల్కి మూవీకి ఒక్క రూపాయి కూడా పారితోషకం మృణాల్ ఠాకూర్ తీసుకోలేదని తెలుస్తోంది. అలాఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు సీతారామం సినిమాతో వచ్చేసరికి తనకి సినీ ఇండస్ట్రీలో జీవితాన్ని ఇచ్చిన వైజయంతి మూవీస్ బ్యానర్ కోసం మృణాల్ ఠాకూర్ రెమ్యూనరేషన్ తీసుకోలేదని తెలుస్తుంది.(Mrunal Thakur )