Nara Lokesh: ప్రస్తుతం ఎక్కడ చూసినా కల్కి పేరే వినిపిస్తుంది. ప్రభాస్ ప్రధాన పాత్రలో నాగశ్విన్ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాని అశ్విని దత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే పలువురు సినీ ప్రేక్షకులు ఈ మూవీకి సంబంధించి తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

Also Read: Kalki 2898 AD: ‘కల్కి 2898 ఏడీ’లో గెస్ట్ రోల్స్ లిస్ట్ పెద్దదే..ఊహించని పేర్లు?

ఇక తాజాగా ఏపీ ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ కల్కి మూవీ గురించి సోషల్ మీడియాలో ఓ ట్వీట్ పెట్టారు. కల్కి సినిమా గురించి అద్భుతమైన రివ్యూస్ వినడం చాలా ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. ప్రభాస్, అమితాబచ్చ, కమల్ హాసన్, దీపికా పదుకొనే అందరికీ కంగ్రాట్స్ తెలియజేశారు.

Nara Lokesh congratulated Kalki movie team.

అదేవిధంగా ఈ సినిమాని ఇండియన్ సినిమాని రీడిఫైన్ చేసే సినిమాగా ఒక మాస్టర్ పీస్ గా రూపొందించేందుకు డైరెక్టర్ నాగలక్ష్మి కి కూడా ధన్యవాదాలు అంటూ పేర్కొన్నారు. అంతేకాకుండా అశ్విని దత్ కి స్పెషల్ కంగ్రాట్స్ తెలియజేశారు. ప్రజెంట్ నారా లోకేష్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కల్కి మూవీ పోస్టర్ను యాడ్ చేస్తూ కల్తీ మూవీ టీం ని ప్రశంసించాడు నారా లోకేష్.