Prabhas Kalki 2898 AD An In Depth Review

నటీనటులు: ప్రభాస్ (Prabhas), అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె, దిశా పటాని, బ్రహ్మానందం,రాజేంద్ర ప్రసాద్,సస్వతా ఛటర్జీ , అన్న బెన్, శోభన, మృణాల్ ఠాకూర్ తదితరులు
డైరెక్టర్: నాగ్ అశ్విన్
ప్రొడ్యూసర్: అశ్విని దత్, ప్రియాంక దత్ అండ్ స్వప్న దత్
మ్యూజిక్ డైరెక్టర్: సంతోష్ నారాయణన్
సినిమాటోగ్రాఫర్: డిజార్డయి స్టోజిలికోవిక్
ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వర రావు
విడుదల తేదీ: 27 జూన్ 2024

Prabhas Kalki 2898 AD Movie Review

ప్రభాస్ హీరో గా నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ కల్కి మూవీ ఈరోజే విడుదల అయ్యింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పై మొదటినుంచి ఎన్నో అంచనాలున్నాయి. దానికి తగ్గట్లునేగా భారీ స్థాయి లో ఈ సినిమా విడుదలైంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకునే వంటి నటులు నటించిన ఈ సినిమా ఏ స్థాయి లో ఉందో సమీక్ష ద్వారా తెలుసుకుందాం.

కథ: సుప్రీం యాస్కిన్‌ (కమల్ హాసన్) ప్రపంచాన్ని నాశనం చేసి వనరులను ఎవరికీ అందనంత ఎత్తులో కాంప్లెక్స్ లో ఉంచి అందరిని బాధిస్తూ ఉంటాడు. కాంప్లెక్స్ లోకి వెళ్లాలని బలంగా ఉంటాడు భైరవ.. అందుకోసమే కాంప్లెక్స్ వాళ్ళు వెతుకుతున్న గర్భవతి అయిన సుమతి (దీపికా పడుకునే) ని పట్టుకుని వాళ్ళకు అప్పగించాలనుకుంటాడు. ఈ క్రమంలోనే ఆమెను కాపాడడానికి అశ్వథామ (అమితాబ్ బచ్చన్) రంగంలోకి దిగుతాడు. సుమతిని కాపాడడానికి అశ్వథామ స్వయంగా రావడానికి కారణం ఏంటి..? అసలు యాస్కిన్ సుమతిని ఎందుకు చంపాలనుకుంటాడు..? భైరవ కాంప్లెక్స్ లోకి వెళ్లాలనే ఆశ తీరిందా అనేది తెలియాలంటే ఈ సమీక్షలోకి వెళ్లాల్సిందే.

నటీనటులు: ఈ సినిమా లో మెయిన్ హైలైట్ అమితాబ్ బచ్చన్ చేసిన అశ్వథామ పాత్ర. అమితాబ్ మరోసారి అద్భుతమైన పాత్రను చేశారు. అమితాబ్‌ చేసిన పోరాట సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ఈ వయసులో అయన చేసిన ఫైట్స్ ను చూస్తే హ్యాట్స్ ఆఫ్ అనాల్సిందే. ఎమోషనల్ సీన్స్‌లో తన కళ్లను మాత్రమే చూపిస్తూ ఇంకా ఆకట్టుకున్నాడు. సుమతి పాత్రలో దీపిక మెప్పించింది. తనకు పుట్టబోయే బిడ్డను కాపాడేందుకు ఆమె చేస్తున్న ప్రయత్నాలు అందరిని ఆకట్టుకుంటాయి. సినిమాకి మూలస్తంభమైన భైరవ పాత్రలో ప్రభాస్ తప్ప మరెవరినీ ఊహించుకోలేం అనే చెప్పాలి. క్లైమాక్స్‌లో ప్రభాస్ పాత్ర ఎలివేషన్ ఆకట్టుకుంటుంది. ఇక వీరి తర్వాత అంతటి స్థాయి లో ఆకట్టుకున్న పాత్రలు మానస్ పాత్ర లో నటించిన సస్వతా ఛటర్జీ. యాష్కీ కు నమ్మకస్థుడుగా ఉన్న మానస్ మంచి ప్రదర్శన కనపరిచాడు. రాజేంద్ర ప్రసాద్, దిశా పటాని, అన్న బెన్, శోభన, మృణాల్ ఠాకూర్ లు ఆకట్టుకున్నారు. ఇకపోతే ఈ సినిమా లో క్యామియో పాత్ర చేసిన విజయ్ దేవరకొండ క్లైమాక్స్ లో మరింత అదరగొట్టాడు. సినిమాకు అదనపు ఆకర్షణ అయ్యాడు. ఇక విలన్ గా చేసిన కమల్ హాసన్ గురించి ఎంత చెప్పిన తక్కువే. ఆయనను గతంలో అలాంటి పాత్రలో ఎప్పుడు చూడలేదు. లోకాన్ని శాసించే యాస్మిన్ పాత్ర లో జీవించి పోయాడు. కనిపించి రెండే రెండు సీన్స్ అయినా ప్రేక్షకుల్లో గుర్తుండిపోతాడు. అలాంటి నటనతో గుర్తుండిపోయాడు.

సాంకేతిక నిపుణులు : సాంకేతికంగా చెప్పాలంటే టెక్నికల్ డిపార్ట్‌మెంట్ మొత్తం కూడా సినిమా కోసం అద్భుతంగా పనిచేసింది. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ ఆకట్టుకున్నాయి. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమా ను ఎలా అయితే ప్రజెంట్ చేయాలనుకున్నాడో అలానే ప్రేక్షకులు కన్విన్స్ అయ్యేలా చూసుకున్నాడు. ప్రతి విజువల్ వండర్ అనే చెప్పాలి. ఇక సంతోష్ నారాయణన్ సంగీతం సినిమాకు ప్లస్ అయింది. పాటలు పెద్దగా లేకపోయినా నేపథ్య సంగీతం మాత్రం మరింత ఆకట్టుకుంది. అలాగే, జోర్డ్జే స్టోజ్‌కోవిక్ సినిమాటోగ్రఫీ చిత్రానికి హైలైట్. కొన్ని కీలక సన్నివేశాల్లో సినిమాటోగ్రాఫర్ అద్భుతంగా పనిచేశారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాగుంది. నిర్మాత అశ్వనీ దత్ సినిమా కోసం బాగానే ఖర్చుపెట్టారు. ఈ సినిమా నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్:

నటీనటులు ప్రదర్శన

కథ

పాత్రల వేషధారణ

మైనస్ పాయింట్స్:

తొలిభాగం ఆసక్తిగా లేకపోవడం

సాగతీత

తీర్పు: కల్కి చిత్రం ఒక విజువల్ వండర్. దర్శకుడు ఇప్పటితరం వారికి ఓ కొత్త లోకాన్ని పరిచయం చేశాడు. అంతేకాదు అమితాబ్ బచ్చన్‌గా నటించిన విశ్వరూపాన్ని చూసే అవకాశం ఈ తరం ప్రేక్షకులకు అందించాడని చెప్పాలి. ప్రభాస్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ కి మంచి కథ తోడయ్యింది. యాక్షన్ సన్నివేశాలు మాస్ ప్రేక్షకులకు బాగా అలరిస్తాయి. దీపికా పదుకొణె ఎమోషనల్ క్యారెక్టర్ ఆకట్టుకుంటుంది.ఇక కమల్ హాసన్ చిన్న పాత్రలో నటిస్తున్న ఎవరూ అంత ఈజీ గా మర్చిపోలేరు.(Prabhas)