The reason why Kalki 2898 AD movie became a hit is that sentimental hero

Kalki 2898 AD: కల్కి మూవీ విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా చూసిన వాళ్ళందరూ ఊర మాస్ లెవెల్ లో రివ్యూలు ఇస్తున్నారు. ఇక మధ్యాహ్నం అయిపోయింది కాబట్టి కచ్చితంగా ఇప్పటివరకు చూసిన జనాలందరూ పాజిటివ్ రివ్యూలు ఇవ్వడంతో కలల్కి సినిమా హిట్ అయిందని ప్రభాస్ ఖాతాలో బాహుబలిని మించి రికార్డు పడబోతుందని చాలామంది భావిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలు ఉన్నారు.

The reason why Kalki 2898 AD movie became a hit is that sentimental hero

ప్రభాస్,దీపిక పదుకొనే మెయిన్ క్యారెక్టర్స్ అయినప్పటికీ వీరి పాత్రలకు ఏమాత్రం తీసిపోకుండా కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్,దిశా పఠాని, విజయ్ దేవరకొండ,దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, శోభన,రాజేంద్రప్రసాద్, మాళవిక నాయర్, రాంగోపాల్ వర్మ, రాజమౌళి వంటి ఎంతోమంది ఈ సినిమాలో సందడి చేశారు. అయితే ఈ సినిమా హిట్ టాక్ వచ్చి హిట్ అవ్వడానికి కారణం ఆ సెంటిమెంట్ హీరోనే అంటూ తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది. (Kalki 2898 AD )

Also Read: Kalki 2898 AD: రూ.600 కోట్ల సినిమా తీసి..అరిగిన చెప్పులతో తిరిగిన డైరెక్టర్…!

అదేంటంటే నాగ్ అశ్విన్ కి సెంటిమెంట్ హీరోగా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి విజయ్ దేవరకొండ ఉంటున్నారట. ఎందుకంటే ఈయన అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో విజయ్ దేవరకొండ ఓ చిన్న పాత్రలో కనిపిస్తారు.అలాగే ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నానితో పాటుగా విజయ్ దేవరకొండ కూడా నటించారు. అంతేకాకుండా మహానటి సినిమాలో కూడా విజయ్ దేవరకొండ జర్నలిస్టుగా చేశారు.

The reason why Kalki 2898 AD movie became a hit is that sentimental hero

ఇక తాజాగా విడుదలైన కల్కి మూవీలో అర్జునుడి పాత్రను పోషించారు. అయితే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కనిపించింది తక్కువ సేపే అయినప్పటికీ ఈయన పాత్రకి మాత్రం మంచి హైప్ వచ్చింది.ఇక కల్కి కూడా హిట్ టాక్ రావడంతో నాగ్ అశ్విన్ సెంటిమెంట్ హీరోగా విజయ్ దేవరకొండ కొనసాగుతున్నాడు అని,ఈ సినిమా ప్రభాస్ వల్ల కాదు విజయ్ దేవరకొండ సెంటిమెంట్ వల్లే హిట్ అయింది అంటూ కొంతమంది రౌడీ హీరో ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.(Kalki 2898 AD )