Kalki 2898 AD Movie: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కృష్ణంరాజు వారసుడుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించిన అనంతరం ప్రభాస్…..బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు. ఆ సినిమా అనంతరం ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా చిత్రాల్లో నటించడం గమనార్హం. ఈ క్రమంలోనే ప్రభాస్ నటించిన తాజా చిత్రం కల్కి 2898 ఏడీ. ప్రభాస్ నటించిన ఏడో పాన్ ఇండియా చిత్రంగా కల్కి సినిమా నిలిచింది. Kalki 2898 AD Movie

These are the plus and minus points of the movie Kalki 2898 AD

ఈ సినిమాలో విశ్వ నటుడు కమల్ హాసన్, బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్, దిశా పటాని, దీపికా పదుకొనే నటించారు. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా….వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాపై భారీగా అంచనాలే పెట్టుకున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. దాదాపు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 9వేలకు పైగా స్క్రీన్స్ లో విడుదలైంది. తెలుగులో 1600కు పైగా థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సినిమా హిందీ, కన్నడ, తమిళ్, మలయాళం మొత్తం 4వేలకు పైగా స్క్రీన్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కు మేకర్స్ ప్లాన్ చేశారు. అలాగే విదేశాల్లోనూ 4500కు పైగా థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ అయింది. Kalki 2898 AD Movie

Also Read: Kalki 2898 AD OTT Release Date: కల్కి ఓటీటీ పార్టనర్ ఫిక్స్..ఎందులో స్ట్రీమింగ్ అంటే?

ఇక కల్కి 2898 ఏడీ. ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు ఒక విజువల్ వండర్ అని చూసిన ఫీలింగ్ తోనే ఉంటారు. ఈ సినిమాలో ఇంటర్వెల్ లో అద్భుతమైన సీన్స్ ఉన్నాయి. అందుకే క్లైమాక్స్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా నాగ్ అశ్విన్ సినిమాని అద్భుతంగా తీశారు. ఇప్పటివరకు ఎవ్వరు చూడని సిజి షాట్స్ చూసి ప్రేక్షకులు షాక్ అవ్వకుండా ఉండరు. ఇక ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రభాస్ ని చూపించిన విధానం. భైరవ పాత్రలో ప్రభాస్ ని చాలా సరదాగా చూపించారు డైరెక్టర్. Kalki 2898 AD Movie

ఎక్కడా కూడా ఓవర్ ఎలివేషన్స్ లేకుండా ఎక్కడ ఎలా చూపించాలో క్లారిటీగా భైరవ పాత్రను చూపించారు. ఇక ఈ సినిమాలో అతి పెద్ద మైనస్ ఏంటంటే…. ఈ సినిమా కథని నాగ్ అశ్విన్ రాసుకోవడమే పెద్ద మైనస్ పాయింట్ గా ఉంది. ఇందులో నాగ్ అశ్విన్ కథపై ఎక్కడ ఫోకస్ పెద్దగా పెట్టలేదు. విజువల్స్ ని కళ్ళకు అద్భుతంగా చూపించడంపై పెట్టిన శ్రద్ధలో కనీసం ఒక 10% అయినా కథపై పెట్టి ఉంటే సినిమా మరో రేంజ్ లో ఉండేది. Kalki 2898 AD Movie