Kalki movie Vijay Devarakonda performance: టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ గా పేరు పొందిన కల్కి ఎట్టకేలకు నేడు థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని సాధిస్తుంది. భారత పురాణాల స్ఫూర్తితో రూపొందిన ఈ మూవీకి నాగస్విన్ డైరెక్షన్ వహించారు. ఇక ముఖ్యంగా విష్ణుమూర్తి పదవ అవతారమైన కల్కి అవతారాన్ని ఈ చిత్రంలో చూపించినట్లుగా తెలుస్తుంది.

Vijay Devarakonda who dusted off that role

దాదాపుగా 600 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందింది ఈ మూవీ. ఇక ముఖ్యంగా భారీ తారాంగణం ‌ తో పాటు టెక్నికల్ వాల్యూస్ కల్కి మూవీ పై మంచి ప్రభావం చూపించాయి. ఇక ఈ సినిమా ఇప్పటికే యూఎస్ తో పాటు అనేక ఏరియాలలో ప్రీమియం షోలు పడ్డాయి. ఇక తాజాగా ఈరోజు విడుదలైన ఈ సినిమా ట్విట్టర్ వేదికగా అభిమానులు తమ అభిప్రాయాలను కూడా వెల్లడించుతున్నారు. మరీ ముఖ్యంగా ఒక నెటిజన్ కల్కి బ్లాక్ బస్టర్ లోడింగ్ మొదట 15 నిమిషాలు అసలు మిస్ కావద్దు.. కీలకమైన పాత్రలో నటించిన విజయ్ దేవరకొండ ఎంట్రీ సీన్ అదిరిపోతుంది అంటూ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

Vijay Devarakonda who dusted off that role

విజయ్ దేవరకొండ అర్జున పాత్రలో నటించారు. తలరాతలు రాసిన బ్రహ్మ దేవుడి రాసిన గాండీవం ఇది.. దీనిని ఎవరు అడ్డుకోలేరు…అంటూ చెప్పే డైలాగ్స్ ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకున్నాయి. అయితే విజయ్ దేవరకొండ ఈ చిత్రంలో ఉన్నారని విషయం పెద్దగా ఎవరికి తెలీదు. అదేవిధంగా ఎవ్వరూ ఊహించలేదు కూడా. కానీ ఈ మూవీలో విజయ్ దేవరకొండ కనిపించడంతో ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. సినిమాలో విజయ్ దేవరకొండ ది చిన్న పాత్ర అయినప్పటికీ తన ఎంట్రీ సీన్స్ తో గూస్ బంప్స్ పుట్టించాడు.