Actress Hema in Tirumala.. Sensational comments on rave party

Hema: తెలుగు సినిమాల్లో అక్కగా.. అత్తగా… అమ్మగా.. పిన్ని గా..వదినగా.. ఇలా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి ఫిమేల్ క్యారెక్టర్ ఆర్టిస్టులలో మంచి గుర్తింపు సంపాదించిన వారిలో నటి హేమ కూడా ఒకరు.. అయితే అలాంటి హేమ ఈ మధ్యకాలంలో బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిన సంగతి మనకు తెలిసిందే.కానీ అందులో తాను లేను అంటూ ఏవేవో వీడియోలు షేర్ చేసి తప్పును కప్పిపుచ్చుకోవాలని చూసింది.కానీ బెంగళూరు పోలీసులు హేమ ఈ పార్టీలో పాల్గొన్న విషయం తేల్చేసారు.

Actress Hema in Tirumala.. Sensational comments on rave party

అంతేకాదు డ్రగ్స్ టెస్ట్ కోసం కూడా ఆమెను పోలీసులు తీసుకెళ్లారు. ఇక దీనిపై మీడియాలో ఎంత రచ్చ జరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతేకాదు సినిమాలో సాంప్రదాయమైన పాత్రలు పోషిస్తూ బయట నువ్వు చేసే పనులు ఇవ్వా అంటూ ఎంతోమంది ఈమెను విమర్శించారు ట్రోల్స్ చేశారు. ఇండస్ట్రీ నుండి కొంతమంది ఈమెపై తమ అక్కసు వెళ్ళగక్కితే మరికొంతమంది సపోర్ట్ చేశారు. (Hema)

Also Read: Kalki: కల్కి మూవీలో శ్రీకృష్ణుడి పాత్రకు వాయిస్ ఓవర్ ఇచ్చిన నటుడు ఎవరో తెలుసా..?

అయితే తాజాగా హేమ తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లి మొక్కు తీర్చుకొని బయటికి వచ్చిన సమయంలో చాలామంది జనాలు ఆమెతో సెల్ఫీలు దిగడానికి చేతులలో ఫోన్స్ పట్టుకొని ఎగబడ్డారు.ఇక వారి అభిమానాన్ని చూసి మురిసిపోయిన హేమ చాలా సంతోషించింది. ఆ తర్వాత బయటకు వచ్చాక మీడియా వాళ్ళు రావడంతో మీడియాతో నవ్వుతూ హేమ మాట్లాడింది. మీ అందరికీ తెలుసు నేను ఇక్కడే పుట్టాననే విషయం.

Actress Hema in Tirumala.. Sensational comments on rave party

అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చిన ప్రతిసారి నాకు నా పుట్టిళ్లులా అనిపిస్తుంది అంటూ చెప్పింది. అయితే ఆమె మాట్లాడుతుండగానే జర్నలిస్టులు బెంగళూరు రేవ్ పార్టీ గురించి ప్రశ్నలు అడిగారు. దాంతో హేమ నవ్వుకుంటూ ఆ విషయం మీకే తెలియాలి మీరే వేస్తున్నారు కదా వార్తలు అంటూ చెప్పుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ప్రస్తుతం హేమకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.(Hema)