Kalki 2898 AD: Prabhas fans warning to venuswamy

Kalki 2898 AD: ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి టైం దొరికితే చాలు సెలబ్రిటీలపై, రాజకీయ నాయకుల జీవితాలపై బురదజల్లే ప్రయత్నం చేస్తారు. అయితే నేను వారి జాతకం ప్రకారం చెబుతున్నాను,వారి నక్షత్రాల ప్రకారమే చెబుతున్నాను అంటూ ఎంతో మంది సెలబ్రిటీల పర్సనల్ విషయాలు కూడా బయటపెట్టారు. ఇందులో మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రెబల్ స్టార్ ప్రభాస్.. అసలు ప్రభాస్ జాతకం బాలేదని,ఆయన సినిమాలు మానేస్తే మంచిదని చెప్పారు.

Kalki 2898 AD: Prabhas fans warning to venuswamy

అంతేకాదు నాకు ప్రభాస్ జాతకం మొత్తం తెలుసునని,ఆయనకు కల్యాణ యోగం లేదని,అలాగే అనారోగ్యం పాలవుతాడని, ఆయన హీరోగా చేసే సినిమాలను నిర్మించే నిర్మాతలు ఒకసారి జాతకం చూయించుకోవాలి అంటూ సంచలన కామెంట్స్ చేశారు. అంతే కాదు ప్రభాస్ చేసే సినిమాలన్నీ అట్టర్ ప్లాఫ్ అవుతాయని, ఆయన ఫ్లాప్ హీరోగా మారిపోతారు అంటూ ఎన్నో నెగటివ్ కామెంట్లు చేశారు.అయితే దీనిపై అప్పట్లో ప్రభాస్ అభిమానులు ఘాటుగా స్పందించారు.అంతే కాదు ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి కూడా దీనిపై ఘాటుగానే రియాక్ట్ అయింది.(Kalki 2898 AD)

Also Read: Kalki 2898AD: అసలు నాగి ప్లాన్ ఏంటి?.. ఇంకా ఎన్ని కథలు ఉన్నాయి?.. ఈ బక్కోడి దగ్గర ఇంత టాలెంట్ ఉందా..?

అయితే తాజాగా కల్కి మూవీ విడుదలై హిట్ అవ్వడంతో వేణు స్వామి పై మరోసారి ట్రోల్స్ చేస్తున్నారు ప్రభాస్ అభిమానులు.. ప్రభాస్ కల్కి సినిమా ఫ్లాప్ అవుతుందని ముందుగానే మమ్మల్ని నిరాశపరచి డిజాస్టర్ మూవీ అని ముద్ర వేశావు. కానీ సినిమా విడుదలై ఎంత పెద్ద హిట్ అయిందో చూసావు కదా..ఇంకొకసారి ప్రభాస్ జాతకం బాగాలేదు సినిమాలు మానేసి ఇంటి దగ్గర ఉంటే మంచిదని,నిర్మాత జాతకం చూపించూకోవాలి,ప్రభాస్ సినిమాలు ప్లాప్ అవుతాయి అని నోటికి వచ్చింది వాగితే మాత్రం చంపేస్తాం అంటూ సోషల్ మీడియాలో వేణు స్వామికి వార్నింగులు ఇస్తున్నారు ప్రభాస్ అభిమానులు..

Kalki 2898 AD: Prabhas fans warning to venuswamy

ఇక ఆ మధ్య కాలంలో ప్రభాస్ పై వేణు స్వామి సంచలన కామెంట్స్ చేసిన సంగతి మనకు తెలిసిందే.ఇప్రభాస్ ను ఉద్దేశించి చేసిన కామెంట్లపై విసుగు చెందిన అభిమానులు ఈ విధంగా ఆయనకు సోషల్ మీడియాలో వార్నింగ్ ఇస్తున్నారు. అయితే ఏపీలో జగన్ మళ్ళీ సీఎం అవుతారు అని తప్పుడు జ్యోతిష్యం చెప్పడంతో అప్పటినుండి ఏ సెలబ్రిటీ జాతకం కూడా ఇక పై పబ్లిక్ గా చెప్పను అంటూ క్షమాపణలు చెబుతూ వీడియో రిలీజ్ చేశారు. అప్పటినుండి వేణు స్వామి ఏ ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం లేదు.(Kalki 2898 AD)