Revanth Reddy: రేవంత్ రెడ్డి ఇంకా ఢిల్లీ లో ఉన్నారు. అందుకని ఈ క్రమం లో ఈరోజు వరంగల్ పర్యటన రేపటికి వాయిదా వేయడం జరిగింది అయితే ముందు రేవంత్ రెడ్డి ఈరోజు వరంగల్ పర్యటించనున్నారు అని అన్నారు. పైగా దాని కోసం షెడ్యూల్ కూడా వేశారు అయితే ఢిల్లీ లో ఉండిపోవడం వలన ఈరోజు పర్యటన రేపటికి వాయిదా వేశారు. నేడు జరగాల్సిన కార్యక్రమాలు యధావిధిగా రేపటికి వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం రేవంత్ రెడ్డి శుక్రవారం వరంగల్లో పర్యటించాల్సి ఉంది. మధ్యాహ్నం 1 కి టెక్స్టైల్స్ పార్కు చేరుకుని రెండు గంటలకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పనులను పరిశీలించాల్సి ఉంది.

Revanth Reddy warangal visit postponed

అలానే ఓరుగల్లులో మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభించడంతో పాటు సాయంత్రం వరంగల్ మున్సిపల్ అధికారులతో సమీక్ష జరపాలి. కానీ అవన్నీ కూడా ఈరోజు కుదరదు సీఎం రేవంత్ రెడ్డి ఇంకా ఢిల్లీలో ఉండడం వలన రేపటికి వీటన్నిటిని వాయిదా వేశారు. ఈరోజు రాత్రి హైదరాబాద్ చేరుకుని రేవంత్ రెడ్డి రేపు వరంగల్ పర్యటనకు వెళ్తారని అధికారులు చెప్పారు.

Also read: Mrunal Thakur: లైఫ్ ఇచ్చిన వైజయంతి బ్యానర్ కోసం ఫ్రీ గా ఆ పని చేసిన మృణాల్ ఠాకూర్.?

టీపీసీసీ చీఫ్ ఎన్నికలతో రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారు. గురువారం ఈ అంశం కొలిక్కి రాక పోవడంతో రేవంత్ రెడ్డి శుక్రవారం కూడా అక్కడే ఉండాలి. ఈ నేపథ్యం లో రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన వాయిదా పడింది ఇంకో పక్క సీఎం పర్యటన దృశ్య అధికారులు అన్ని ఏర్పాట్లు చూసారు ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీస్ శాఖ కూడా భద్రత కట్టుదిట్టం చేసింది (Revanth Reddy).