Vishwak Sen deleted his Instagram account

Vishwak Sen: మాస్ హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న యంగ్ హీరోలలో విశ్వక్ సేన్ ఒకరు.ఈయన దాస్ కా ధమ్ కీ , పాగల్,ఈ నగరానికి ఏమైంది, హిట్ , అశోక వనంలో అర్జున కళ్యాణం, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వంటి సినిమాల్లో నటించి ఇండస్ట్రీలో మాస్ హీరోగా తన స్థానాన్ని పదిలం చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఆయన మంచి మంచి కథలను ఎంచుకుంటూ మాస్ హీరోగా నిలదొక్కుకోవాలని చూస్తున్నారు.

Vishwak Sen deleted his Instagram account

అయితే ఈయన కేవలం సినిమాలు మాత్రమే కాదు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్నారు. ఈయన నటించిన ఓ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రోడ్డు మీదే ఫ్రాంక్ చేయడం అలాగే టీవీ9 కి వెళ్లి అక్కడ లైవ్ లోనే జర్నలిస్ట్ తో గొడవ పడడం ఇలా ఎన్నో వివాదాల్లో ఇరుక్కున్నారు. అయితే అలాంటి విశ్వక్ సేన్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటారు. కానీ తాజాగా తన సోషల్ మీడియా ఖాతా అయినా ఇంస్టాగ్రామ్ ని డిలీట్ చేశారు. దీంతో ఈయన అభిమానులు అతలాకుతలం అవుతున్నారు.(Vishwak Sen )

Also Read: Kalki: 600 కోట్ల సినిమా అంటే కల్కి లాగా ఉండాలి.. మరోసారి ఓం రౌట్ నీ ఏకేస్తున్న జనాలు..!

అసలు ఎందుకు మీరు ఈ అకౌంట్ ని డిలీట్ చేశారు అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దాంతో విశ్వక్ ని ఎక్స్ వేదికగా ఎంతోమంది ప్రశ్నలు అడుగుతున్నారు.అయితే ఈ విషయంపై ఇంస్టాగ్రామ్ లో ఓ స్టోరీ షేర్ చేశారు. ఇప్పటినుండి నేను సోషల్ మీడియాకి దూరంగా ఉంటాను అని.. అయితే ఆ తర్వాత ఈయన ఇన్స్టాగ్రామ్ ఖాతా ఎక్కడ కనిపించడం లేదు.దాంతో విశ్వక్ సేన్ ఇంస్టాగ్రామ్ ఖాతా డిలీట్ చేశారని ఆయన అభిమానులు బాధ పడిపోతున్నారు.

Vishwak Sen deleted his Instagram account

అయితే దీనికి సోషల్ మీడియాలో వచ్చే నెగటివ్ రివ్యూసే కారణం అని తెలుస్తోంది. అయితే గత కొద్ది రోజులుగా సినిమా చూడకుండా నెగటివ్ రివ్యూలు ఇచ్చే వారిపై సీరియస్ అవుతున్నారు విశ్వక్ సేన్.ఈ మధ్యకాలంలో కల్కి మూవీ రిలీజ్ అవ్వకముందే ఆ మూవీ గురించి ఓ యూట్యూబర్ రివ్యూ ఇవ్వడంతో దానిపై ఫైర్ అయ్యారు విశ్వక్ సేన్ . ఇలా సోషల్ మీడియాలో వచ్చే నెగెటివిటీని తట్టుకోలేకే అలా ఇంస్టాగ్రామ్ ఖాతాను డిలీట్ చేసినట్టు తెలుస్తుంది.(Vishwak Sen )