Vivo T3 Lite 5G: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ ను విపరీతంగా వాడుతున్నారు. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ కనిపిస్తుంది. ప్రస్తుతం కాలంలో స్మార్ట్ ఫోన్ లేనివారు అంటూ ఎవరూ లేరు. అతి తక్కువ ధరకే ఈ ఫోన్ లు లభించడం వల్ల ప్రతి ఒక్కరు వాటిని కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయా కంపెనీదారులు ఈ ఫోన్లను తక్కువ ధరకే విక్రయాలు జరుపుకుంటున్నాయి. Vivo T3 Lite 5G

Vivo T3 Lite 5G launched in india

ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో తన వివో టీ 3 లైట్ 5 జి ఫోన్ ను తాజాగా మార్కెట్లోకి ఆవిష్కరించింది. ఈ ఫోన్లో 50 మెగా పిక్సెల్ డ్యూయల్ వేర్ కెమెరా సెటప్ మీడియా టెక్ డైమెన్సిటీ 6300 ఎస్ఓసి ప్రాసెసర్ తో ఈ ఫోన్ లభిస్తోంది. ఇక ఈ ఫోన్లో ఫోర్ జిబి ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ తో రూ. 10,499…. 6 జిబి ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ తో రూ. 11,499 రూపాయలకు ఈ ఫోన్ లభిస్తోంది. Vivo T3 Lite 5G

Also Read: Nokia 3210: UPI పేమెంట్స్‌ ఆప్షన్‌తో నోకియా ఫీచర్ ఫోన్లు..ధర వివరాలు ఇవే !

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ తో పాటు వివో ఇండియా వెబ్సైట్ సెలెక్టెడ్ రిటైల్ స్టోర్ లలో వచ్చే నెల నాలుగవ తేదీ నుంచి ఈ ఫోన్స్ సేల్స్ ప్రారంభమవుతాయి. ఈ ఫోన్ మనకు రెండు కలర్లలో లభిస్తోంది. మెజిస్టిక్ బ్లాక్, వైబ్రేంట్ గ్రీన్ కలర్ లలో అందుబాటులోకి వస్తోంది. Vivo T3 Lite 5G

వివో t3 లైట్ ఫైవ్ జి ఫోన్ 90 HZ రిఫ్రెష్ రేటుతో 840 నిట్స్ పిక్ బ్రైట్ నెస్ తో ఉంటుంది. ఈ ఫోన్ లో 6.56 అంగుళాల ఫుల్ హెచ్డి ఎల్ఈడి స్క్రీన్ ను అమర్చారు. ఈ ఫోన్లో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా, 2 మెగా పిక్స్ సెన్సార్ కెమెరా… సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్ సెన్సార్ కెమెరా విత్ సెంటర్డ్ వాటర్ డ్రాప్ నాచ్ కలిగి ఉంది. Vivo T3 Lite 5G