Chiranjeevi first night in the train

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తన పెళ్లిని హడావిడిగా చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.ఆయన సినిమా షూటింగ్ ఉండడంతో ఓవైపు షూటింగ్లో పాల్గొని ముహూర్తం సమయానికి అక్కడికి వచ్చి చిరిగిన చొక్కా తోనే సురేఖ మెడలో తాళికట్టారు. ఇక ఈ విషయాన్ని చాలా సందర్భాలలో ఆయన అభిమానులు చిరంజీవి గుర్తు చేసుకుంటూ ఉంటారు. అయితే అప్పట్లో చిరంజీవి అప్పుడప్పుడే స్టార్ గా ఎదుగుతూ బిజీయెస్ట్ హీరోగా ఉన్నారు.

Chiranjeevi first night in the train

దాంతో ఆయనకు సురేఖతో గడిపే అవకాశం కూడా ఎక్కువగా రాలేదట. అలా పెళ్లయిపోవడంతోనే వెంటనే సినిమా షూటింగ్స్ లో పాల్గొన్నారు చిరంజీవి. ఇక ఈ విషయం మొత్తం తెలుసుకున్న డైరెక్టర్ రాఘవేంద్ర రావు ఆయనకు ట్రైన్ లో ఫస్ట్ నైట్ అరేంజ్ చేసి పెద్ద షాక్ ఇచ్చారట. ఇక ఈ విషయాన్ని చిరంజీవి సౌందర్యలహరి ప్రోగ్రాం లో బయటపెట్టారు. (Chiranjeevi )

Also Read: Kalki 2898 AD: కల్కి హిట్.. చంపేస్తామంటూ వార్నింగ్.. మొహం చాటేసిన వేణు స్వామి..!

చిరంజీవి ఆ ప్రోగ్రాం లో మాట్లాడుతూ.. నేను మూవీ షూటింగ్ అయిపోవడంతో చెన్నైకి సురేఖతో కలిసి తిరుగు ప్రయాణం చేశాను. అయితే ఆ టైంలో ట్రైన్ టికెట్ బుక్ చేసిన రాఘవేంద్రరావు స్పెషల్ గా కుపే అనే బెర్త్ ను తీసుకున్నారు. ఇక ఇది ఎక్కడి స్పెషల్ అంటూ సురేఖతో పాటు నేను ట్రైన్ ఎక్కి నా బెర్త్ దగ్గరికి వెళ్ళగా అది చూసి నేను నా భార్య షాక్ అయ్యాం. ఎందుకంటే ఆ బెర్త్ మొత్తం ఫస్ట్ నైట్ గది ఎలా ఉంటుందో అలా డెకరేట్ చేసి ఉంది.

Chiranjeevi first night in the train

ఇక ఆ బెర్త్ చూసి నేను సురేఖ షాక్ అయిపోయాం. సురేఖ అయితే కాస్త సిగ్గు పడింది. ఇక ఈ విషయం ఇప్పటికి కూడా సురేఖ మర్చిపోదు. నేను ఎప్పుడైనా రాఘవేంద్రరావు దగ్గరికి వెళ్తున్నాను అంటే ఆరోజు జరిగిన సంఘటనే గుర్తు చేసుకుంటుంది.కొత్తగా పెళ్లయిన మాకోసం రాఘవేంద్రరావు చేసిన పని మా లైఫ్ లో ఎప్పటికీ ఒక తీపి గుర్తుగానే మిగిలిపోయింది అంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు.(Chiranjeevi )