Kalki: ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరి నోట విన్న కల్కి వేరే సంచలనం అవుతుంది. ఈ మూవీ అంతలా ప్రభావాన్ని చూపుతుంది మరి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీపై విడుదలకు ముందు నుంచే ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇక నాగ్ అశ్విన్ డైరెక్షన్లో రూపొందున ఈ మూవీని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అగ్ర నిర్మాత అశ్విని దతు నిర్మించారు.

Kalki broke the triple R records

ఈ సినిమాకి సంతోష్ నారాయణ సంగీతం అందించారు. 600 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీలో దీపికా పదుకొనే హీరోయిన్గా నటించింది. అలాగే బిగ్ జి అమితాబచ్చన్ అండ్ కమల్ హాసన్ మరియు దిశా పటాని వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. కల్కి సినిమాకు నైజాంలో 65 కోట్లు సిడెడ్ లో 27 కోట్లు ఏపీలో 76 కోట్లు కలిపి తెలుగులో 168 కోట్లు బిజినెస్ జరిగింది. అదేవిధంగా కర్ణాటకలో 25 కోట్లు తమిళనాడులో 16 కోట్లు కేరళలో ఆరు కోట్లు ఓవర్సీస్ లో 70 కోట్లు.. రెస్టాఫ్ ఇండియా ప్లస్ హిందీ లో 85 కోట్లు మొత్తం గా కలుపుకుని 370 కోట్లు బిజినెస్ జరిగింది.

Kalki broke the triple R records

టెక్నికల్ వండర్ గా రూపొందిన కల్కి మూవీకి అన్ని ఏరియాల్లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే ఈ మూవీ మొదటి రోజు అన్ని ఏరియాలో భారీ కలెక్షన్స్ నమోదు చేసింది. మొదటి రోజు ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 48 కోట్లు షేర్ కలెక్షన్స్ చేసింది. ఓన్లీ నైజాం ఏరియాలోకి సినిమా త్రిబుల్ ఆర్ రికార్డులను బ్రేక్ చేసింది. త్రిబుల్ ఆర్ మూవీ 22. 55 కోట్లు రాబడితే ప్రభాస్ కల్కి 24 కోట్లను కలెక్షన్స్ చేసింది. ఇక మిగతా ప్రాంతాల్లో ఇంకా అఫీషియల్ కలెక్షన్లు వివరాలు వెలుగులోకి రాలేదు.