Kalki 2 day box office collection: ప్రభాస్ నటించిన కల్కి మూవీ కి ఉన్న హైట్ కారణంగా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ స్థాయి కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఈ మూవీకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో రెండో రోజు నుంచి ఈ సినిమా కలెక్షన్స్ మరింత పెరుగుతాయని భావించినప్పటికీ శుక్రవారం కనుక జూన్ 28న మాత్రం ముందస్తు అంచనాల ప్రకారం ఏకంగా 40 ఆరు శాతం వరకు పడిపోయినట్లు sacnilk.com శాఖ వెల్లడించింది. నాగ అశ్విన్ డైరెక్ట్ చేసిన కల్కి మూవీకి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 191.5 కోట్లు వచ్చాయి.

Did Prabhas take less remuneration for Kalki 2898 AD movie

ఇక తొలి రోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. గురువారం అనగా జూన్ 27న హాలిడే కాకపోయినా కూడా ఈ స్థాయి కలెక్షన్స్ రాబట్టడం ఆశ్చర్యం అనేది చెప్పుకోవచ్చు. ఇక ఈ లెక్కన రెండో రోజు అయినా శుక్రవారం కలెక్షన్లు పెరగాల్సి ఉన్నప్పటికీ ఎందుకో గాని తగ్గాయి. Sacnilk.com ప్రకారం ఈ మూవీ రెండో రోజు ఇండియన్ వైడ్ కలెక్షన్లు 51 కోట్లుగా ఉన్నాయి. ఇక ఇందులో తెలుగు నుంచి 24.65 కోట్లు తమిళం నుంచి 3.5 కోట్లు.. హిందీ 20.5 కోట్లు.. కన్నడ 0.3 కోట్లు.. మలయాళం నుంచి రెండు కోట్లు వచ్చినట్లు తెలుస్తుంది.

Kalki advance bookings start

నిజానికి తొలి రోజు ఇండియన్ వైడ్ కలెక్షన్లు 95.3 కోట్లుగా ఉండగా సుమారు 46% పడిపోయాయి. ఇక నిజానికి తొలి షో నుంచే ఈ మూవీకు ఎక్కడా నెగిటివ్ టాక్ రాలేదు. అయినా కూడా రెండో రోజు వసూళ్లు పడిపోయాయి. సెకండ్ మళ్లీ ఈ కలెక్షన్లు రెట్టింపు కావచ్చు అని అంచనా వేస్తున్నారు. శని ఆదివారాల్లో మరోసారి కల్కి సినిమాకి రికార్డ్ కలెక్షన్స్ రావడం ఖాయం అంటూ కొందరు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఇక ప్రభాస్ కల్కి మూవీ హిందూ పురాణాలకు సైన్స్ ఫిక్షన్ జోడించి తీసింది. ఈ మూవీలోని విజువల్స్ అండ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ విజన్ చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. ఇక ఇందులో ప్రభాస్, అమితాబచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటాని తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.