Sekhar Kammula: Making a movie with Nayanthara is a big mistake

Sekhar Kammula: సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకులు ఉంటారు. కానీ కొంతమంది మాత్రమే ప్రేక్షకుల్లో గుర్తింపు పొందుతారు. ఎందుకంటే వాళ్లు దర్శకత్వం వహించే సినిమాలు ప్రేక్షకుల్లో బలంగా చొచ్చుకొనిపోతాయి. అలా వాళ్ళు తీసిన సినిమాలు ప్లాప్ అయినా కూడా జనాలు ఆదరిస్తూ ఉంటారు.ఇక టాలీవుడ్ లో ఉన్న దర్శకులలో శేఖర్ కమ్ముల కూడా ఒకరు. ఈయన గోదావరి, ఆనంద్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, లీడర్,ఫిదా, లవ్ స్టోరీ, హ్యాపీడేస్ వంటి ఎన్నో హిట్ మూవీస్ తెరకెక్కించారు.

Sekhar Kammula: Making a movie with Nayanthara is a big mistake

ఈయన చేసే సినిమాలు చూస్తే ఎవరైనా సరే ఫిదా అయిపోతారు. ఎందుకంటే ఈయన సినిమాల్లో చాలా వరకు న్యాచురాలిటీ ఉంటుంది. అయితే అలాంటి శేఖర్ కమ్ముల నయనతార తో ఆ సినిమా చేసి పెద్ద తప్పు చేశాను అంటూ సంచలన కామెంట్స్ చేశారు.మరి ఎందుకు ఆయన అలా మాట్లాడారో ఇప్పుడు చూద్దాం.. శేఖర్ కమ్ముల నయనతారతో అనామికా అనే లేడి ఓరియెంటెడ్ మూవీ తీశారు.(Sekhar Kammula)

Also Read: Kalki 2: కల్కి 2 లో కొనసాగనున్న ఆ స్టార్ నటుడి పాత్ర…. పక్కా పూనకాలే అంటున్న నెటిజెన్స్…!

అయితే ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఇక ఈ సినిమాని నిర్భయ అనే ఘటన జరిగిన సమయంలో తీశారు. దేశం మొత్తం నిర్భయ ఘటన వ్యాపించిన సమయంలో శేఖర్ కమ్ముల స్టార్ హీరోయిన్ అయిన నయనతార తో ఈ సినిమా చేస్తే బాగుంటుందని నిర్ణయించుకున్నారట. కానీ అనామిక సినిమా రీమేక్.అలాగే వర్క్ అవుట్ అవ్వలేదు.

Sekhar Kammula: Making a movie with Nayanthara is a big mistake

దాంతో నిర్భయ సమయంలో నయనతార వంటి పెద్ద హీరోయిన్ తో ఈ సినిమా తీసి పేద తప్పు చేశాను అంటూ శేఖర్ కమ్ముల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అలాగే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీ కూడా తనకి అంతగా వర్కౌట్ అవ్వలేదని శేఖర్ కమ్ముల చెప్పారు. ఇక శేఖర్ కమ్ముల ప్రస్తుతం కోలీవుడ్ హీరో ధనుష్ తో కుబేర అనే మూవీ చేస్తున్నారు. ఈ మూవీలో నాగార్జున కీలకపాత్ర చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.(Sekhar Kammula)