SIM Card: టెలికం రంగంలో పెద్ద మార్పే వచ్చింది. జూన్ 26 తర్వాత దేశభ్యాప్తంగా టెలి కమ్యూనికేషన్స్ చట్టం 2023 అమల్లోకి వచ్చిన సంగతి మనందరికీ తెలుసు. అయితే గత ఏడది డిసెంబర్లోనే ఈ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది. చట్టం ప్రకారం చూసినట్లయితే ఇప్పుడు భారతదేశంలో ఏ పౌరుడు తన జీవితకాలంలో 9 సిమ్ములు కంటే ఎక్కువ సిమ్ కార్డులను పొందలేరు. ఒకవేళ పరిమితికి మించి వారు సిమ్ కార్డులను ఉపయోగించినట్లు తెలిసింది అంటే చర్యలు తప్పవు. టెలికాం రంగంలో పెద్ద మార్పులు తీసుకొచ్చారు 26 నుండి దేశవ్యాప్తంగా టెలి కమ్యూనికేషన్స్ చట్టం 2023 అమల్లోకి వచ్చింది.

SIM Card new rules

ఇండియాలో ఏ పౌరుడు జీవిత కాలంలో 9 కంటే ఎక్కువ సిమ్ కార్డులను పొందలేరట ఒకవేళ పరిమితికి నుంచి సిమ్ కార్డులు వాడినట్లు తెలిసిందంటే 50,000 నుండి 2 లక్షలు వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది ఇదే కాకుండా మరొకరి ఐడి నుండి మోసపూరిత సిమ్ కార్డులు పొందినట్లయితే మూడేళ్లు జైలు శిక్ష ఉంటుంది అలానే 50 లక్షలు వరకు కూడా జరిమానా పడుతుంది. కొత్త టెలికాప్ చట్టం ప్రకారం అవసరమైతే ప్రభుత్వం నెట్వర్క్ నిలిపివేయొచ్చు. ఇది మీ సందేశాలను కూడా నిలిపివేయవచ్చు. అంతేకాదు పాత చట్టంలో అనేక మార్పులు చేయడం ద్వారా ప్రభుత్వం అనేక అధికారులను తన వద్దనే ఉంచుకుంది.

Also read: Modi: షాంఘై సమస్యకు మోడీ దూరం..!

అత్యవసర సమయంలో ప్రభుత్వం ఏదైనా టెలికమ్యూనికేషన్ సేవా లేదా నెట్వర్క్ ని నియంత్రించొచ్చు. దీంతో పాటుగా ప్రభుత్వా అనుమతి కూడా ప్రభుత్వ అనుమతి తర్వాత ప్రైవేట్ ప్రాపర్టీ లో టవర్లు కూడా ఏర్పాటు చేయనుంది. దీనికి డిసెంబర్ లోనే పార్లమెంట్లో ఆమోదం తెలిపారు ఇది దేశంలోనే 138 ఏళ్ల భారతీయ టెలిగ్రాఫ్ చట్టం. ది ఇండియన్ వైర్లెస్ టెలిగ్రాఫ్ చట్టం 1993 స్థానంలో ఉంటుంది టెలికమ్యూనికేషన్ చట్టం 2023లో చాలా మార్పులు వచ్చాయి ఇందులో ఏదైనా అత్యవసర పరిస్థితిలో అవసరమైతే ఏదైనా టెలికాం సేవ లేదా నెట్వర్క్ ను నిర్వహణను ప్రభుత్వం నియంత్రించగలుగుతుంది (SIM Card).