That Hero wanted to marry Jayasudha for the second time

Jayasudha: సహజనటి..ఈ పేరు వినగానే అందరికీ గుర్తుకు వచ్చేది సీనియర్ హీరోయిన్ జయసుధ మాత్రమే.తన అందం, అభినయంతో ఎన్నో సినిమాల్లో తన సహజ నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఇక ఈమె ఎలాంటి పాత్ర ఇచ్చినా సరే అందులో లీనమై పోయి నటించడంతో అందరూ ఈమెకు సహజనటి అనే బిరుదు ఇచ్చారు. ఇక అప్పట్లో గ్లామర్ పాత్రలు చేస్తూ ఇండస్ట్రీలో రాణిస్తున్న సమయంలో చాలామంది హీరోయిన్ల మధ్య పోటీ తత్వ ఉండేది.

That Hero wanted to marry Jayasudha for the second time

ఇక అదే సమయంలో జయప్రద,శ్రీదేవి మధ్య పోటీ ఇంకా ఎక్కువ ఉండేది. కానీ ఈ ఇద్దరికీ బాలీవుడ్ లో ఎక్కువ ఆఫర్స్ రావడంతో వాళ్ళు బాలీవుడ్ కే పరిమితమయ్యారు.దాంతో జయసుధ సౌత్ లో తిరుగు లేకుండా పోయింది. అలా ఎక్కువ సినిమాలు జయసుధ కి వచ్చాయి. అయితే అలాంటి ఈ హీరోయిన్ మొదట రాజేంద్రప్రసాద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని ఆ తర్వాత విడాకులు తీసుకొని బాలీవుడ్ నటుడు జితేంద్ర సోదరుడు అయినటువంటి నితిన్ కపూర్ ని రెండో పెళ్లి చేసుకుంది.. (Jayasudha )

Also Read: Rajamouli: పవన్ కళ్యాణ్ తో రాజమౌళి మూవీ.. నిజమేనా..?

వీరికి పిల్లలు కూడా ఉన్నారు.కానీ పెళ్లయిన కొద్ది సంవత్సరాలకే నితిన్ కపూర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఇదంతా పక్కన పెడితే రెండో భర్త నితిన్ కపూర్ ముందే ఓ స్టార్ హీరో జయసుధను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను అంటూ ధైర్యంగా అడిగారట. ఇక ఆయన ఎవరో కాదు అప్పట్లో తన సినిమాలతో అందరినీ అట్రాక్ట్ చేసిన జెడి చక్రవర్తి. ఈయన గులాబీ, బొంబాయి ప్రియుడు, మనీ మనీ వంటి ఎన్నో సినిమాల్లో నటించి అప్పటి స్టార్ హీరోల సరసన నిలిచారు. అయితే ఈ హీరోకి జయసుధ, శ్రీదేవి అంటే చాలా ఇష్టమట.

That Hero wanted to marry Jayasudha for the second time

ఇక జె.డి చక్రవర్తి రాంగోపాల్ శిష్యుడు అనే సంగతి కూడా చాలా మందికి తెలుసు. అయితే జయసుధ నితిన్ కపూర్ ని పెళ్లి చేసుకున్నాక ఓ రోజు నితిన్ కపూర్ దగ్గరికి వెళ్లి జయసుధను నేను మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని ధైర్యంగా చెప్పారట.ఇక దానికి ఫన్నీగా ఆన్సర్ ఇచ్చిన నితిన్ కపూర్ మీరు జయసుధని మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటే మే 17న చేసుకోండి అని ఆన్సర్ ఇచ్చారట. దానికి ఏమీ అర్థం కాని జె.డి.చక్రవర్తి ఎందుకలా అని అడగగా.. ఎందుకంటే ఆ రోజు మా పెళ్లి రోజు.. మీరు అదే తేదీన పెళ్లి చేసుకుంటే పెళ్లి డేట్ ఒకటే అవుతుంది కానీ భర్తలు మారతారు అంటూ ఫన్నీగా ఆన్సర్ ఇచ్చేసరికి జెడి చక్రవర్తి షాక్ అయ్యారట.(Jayasudha )