Lava Blaze X 5G: ప్రస్తుత కాలంలో 5జీ ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరి చేతిలో 5జీ ఫోన్లు కనిపిస్తున్నాయి. ఫోన్లను అతి తక్కువ ధరకే ఆయా కంపెనీదారులు తీసుకురావడంతో విపరీతంగా 5జీ ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా లావా కంపెనీ నుంచి అతి తక్కువ బడ్జెట్ లో Lava Blaze X 5G ఫోన్ ను ఇండియన్ మార్కెట్లోకి తీసుకురాబోతున్నారు. Lava Blaze X 5G

Lava Blaze X 5G launch date announced

ఈ ఫోన్ జూలై 10వ తేదీన విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇక ఈ ఫోన్లో ఫీచర్ల విషయానికొస్తే…. మీడియాటెక్ డైమెన్షన్ 7050 చిప్ సెట్ ఉంటుంది. Lava Blaze X 5G ఫోన్లో 16 జిబి ర్యామ్ అందుబాటులో కలదు. Lava Blaze X 5G ఫొన్ 33W చార్జింగ్ సపోర్ట్ తో నడుస్తుంది. 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇక ఈ ఫోన్ ధర రూ. 15,000 కంటే తక్కువగా ఉంటుంది. ఇందులో ఫుల్ హెచ్డి ప్లస్ కర్వ్డ్ డిస్ప్లేను అమర్చారు. ఇది ఆండ్రాయిడ్ 14 తో వస్తుందని వార్తలు వస్తున్నాయి. Lava Blaze X 5G

Also Read:

ఇక ఇందులో ఫోటోలు, వీడియోల కోసం 64 మెగా పిక్సెల్ సోనీ IMX682 సెన్సార్, 8 మెగా పిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. అంతేకాకుండా డ్యూయల్ రియర్ కెమెరా, సెటప్ కూడా కలిగి ఉండే అవకాశం ఉంటుంది. Lava Blaze X 5G ఫోన్ జూలై 20 నుంచి 21 వరకు అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో ఫోన్ కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఫోన్ ఆగస్టులో రిటైల్ స్టోర్లలో కొనుగోలుకు అందుబాటులోకి వస్తుంది. Lava Blaze X 5G