Mobile Tips: వర్షాకాలం మొదలైంది వర్షాకాలంలో ఆఫీస్ కి వెళ్లడానికి స్కూలుకు వెళ్లడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒక్కొక్కసారి తడిసిపోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు స్మార్ట్ ఫోన్ కూడా తడిసిపోయే పరిస్థితి కలుగుతుంది. ఫోన్ తడిసిపోతే ఏం చేయాలి..? వర్షాకాలంలో ఫోన్ పట్ల జాగ్రత్త తీసుకోవాలి లేదంటే ఫోన్ పాడయ్యే అవకాశం ఉంటుంది. దీంతో మీకు ఎంతో నష్టం వాటిల్లుతుంది. అయితే వర్షాకాలంలో ఫోన్ తడిసిపోతే ఎటువంటి జాగ్రత్త వాటిని పాటించాలి ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని చూద్దాం. మరి ఎటువంటి ఆలోచనలు కూడా దీనికోసం పూర్తిగా చూసేయండి.

Mobile Tips when phone dropped in water

వర్షం వలన నీరు మీ ఫోన్ లోకి వెళ్ళిపోతే దానిని ఆరబెట్టడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. వాటి ద్వారా మీరు మీ ఫోన్లో సేవ్ చేయొచ్చు. ఇక్కడ కొన్ని ముఖ్యమైన దశలో ఉన్నాయి వీటిని ఫాలో అయితే ఫోన్ ఈజీగా ఫోన్ కి ఎలాంటి సమస్య ఉండదు. ఈజీ గానే పనిచేస్తుంది. ఫోన్ నీటిలో పడినా లేదంటే తడిసిన వెంటనే ఆఫ్ చేయండి. ఫోన్ లోకి నీళ్లు చేరితే షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది ఇలా చేయడం చాలా ముఖ్యం. అలాగే మెత్తని గుడ్డ లేదా టవల్ తీసుకుని ఫోన్ పూర్తిగా తుడవండి. నీరు చాలా లోతుకు వెళ్ళకుండా జాగ్రత్త వహించాలి. వీలైతే వ్యాక్యూమ్ క్లీనర్ ని ఉపయోగించండి. ఫోన్ లోపల నుండి నీటిని తీసేస్తుంది.

Also read: Phone Storage Tips: మీ ఫోన్‌ స్టోరేజీ నిండిపోతే ఇలా చేయండి..!

సిలికాన్ జెల్ పాకెట్ ఉన్న గాలిచొరబడిన బ్యాగ్ లో ఫోన్ని ఉంచండి. ప్రభావితంగా పనిచేస్తుంది. సిలికాన్ జెల్ లేకపోతే బియ్యండబ్బాలో మీరు ఫోన్లు పెట్టొచ్చు. బియ్యాన్ని గాలి చొరబడిన డబ్బాలో వేసి ఫోన్ని పూర్తిగా నొక్కండి. 24 నుండి 48 గంటల పాటు అలా వదిలేస్తే బియ్యం కూడా తేమనుగ్రహిస్తుంది. ఒకవేళ కనుక పై పద్ధతులు అందుబాటులో లేకపోతే ఫోన్ ని పొడిగా బాగా వెంటనే చేసే ప్రదేశం లో ఉంచాలి. కానీ సూర్యకాంతిలో మాత్రం పెట్టకండి. ఫోన్ ఆన్ చేసే ముందు కనీసం 24 నుండి 48 గంటల పాటు పొడిగా ఉండే ప్రదేశంలో ఉంచండి. తొందరపడి ఫోన్ ఆన్ చేయకండి పూర్తిగా ఆరే వరకు ఆన్ చేయడం మంచిది కాదు. ఫోన్ పూర్తిగా ఆరిపోయిందని నిర్ధారించుకునే వరకు దాన్ని ఆన్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు (Mobile Tips).