Recharge plans: మొబైల్ టారిఫ్ రేట్లను ప్రముఖ టెలికం కంపెనీలు వరుస పెట్టి పెంచుతున్న విషయం మనకు తెలిసిందే. ముందుగా రిలయన్స్ జియో 12.5% నుండి గరిష్టంగా 25% వరకు టారిఫ్ పెంచినట్లు ప్రకటించింది. జులై 3 నుండి అమల్లోకి రాబోతుంది. ఇక భారతీయ ఎయిర్టెల్ కూడా భారీగానే టారిఫ్స్ ని పెంచింది. వోడాఫోన్ ఐడియా కూడా 23% వరకు రీఛార్జి ప్లాన్ ధరలను పెంచింది. జూలై 4 నుండి ఇవి అమల్లోకి రాబోతున్నాయి. ఈ రీఛార్జి ధరలు పెరగడంతో జులై భారతీయ టెలికాం వినియోగదారులపై ఏటా 47,500 కోట్ల మీద అదనపు భారం పడుతుందని తెలుస్తోంది.

Recharge plans jio, airtel

ఈ మేరకు కోటక్ ఇన్స్టిట్యూషన్ ఈక్విటీస్ రీసెర్చ్ నోట్లో వెల్లడించింది అయ టెలికం కంపెనీలు తమ 5G డేటా ప్లాన్ వైపు యూజర్లను ఆకర్షించడానికి ఇలా చేస్తున్నట్లు రిపోర్ట్ లో వెల్లడించింది. కోటక్ సంస్థ ఇప్పుడు జియో లో 5G ఇంటర్నెట్ ప్లాన్ కోసం కనీసం 349 వెచ్చించాల్సి ఉంది. డైలీ టు జీబీ డేటా వస్తుంది అంతకు ముందు 239 రీఛార్జి తోనే డైలీ 1.5 GB డేటా తో 5G ప్లాన్లు ఉండేవి. ఇది ఎయిర్టెల్ లో చూస్తే 5G ప్లాన్ కోసం గతంలో రోజుకు 1.5gb డేటా తో 239 చెల్లిస్తే సరిపోయేది.

Also read: iPhone 16: లాంచింగ్‌కు సిద్ధమైన ఐఫోన్‌ 16…!

ఇప్పుడు కచ్చితంగా 2.5gb డేటా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టెలికం కంపెనీల పాపులర్ రీఛార్జ్ ప్లాన్ రేట్స్ దేంట్లో ఎలా ఉన్నది అని చూస్తే 28 రోజుల కనీస రీఛార్జి ప్లాన్ జియోలో 189 కి చేరగా ఎయిర్టెల్ వోడాఫోన్ ఐడియా 199 కి చేరింది. 56 రోజుల ప్లాన్ విషయంలో చూస్తే మూడిట్లో దాదాపు ఓకేలా ఉన్నాయి. 84 రోజులు ప్లాన్ ధరలో జియో 799కి పెరిగింది. ఎయిర్టెల్ నుంచి 859 కి పెరిగాయి. ఇంతకుముందు కనీస రీఛార్జ్ ప్యాకేజీల పైన ఫైవ్ జి డేటా ఫ్రీగా అపరిమితంగా ఇస్తూ వచ్చిన జియో ఎయిర్టెల్ కొత్త రూల్స్ ని తీసుకువచ్చాయి జియో లో డైలీ టు జిబి కంటే ఎక్కువ డేటా ఎయిర్టెల్ 2.5 జిబి కంటే ఎక్కువ రీఛార్జి ప్లాన్ తో 5జి అందించినట్లు చెప్పి షాక్ ఇస్తున్నాయి (Recharge plans).