Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల కల్పనకు ప్రోత్సాహంగా వరంగల్లో 3 పడకల సూపర్ స్పెషాలిటీ మెడికోవార్ ఆసుపత్రిని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అయితే ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం జరిగింది ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వైద్య రంగాన్ని విస్తరించాలన్న ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఇక్కడ ఆసుపత్రిని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. అలానే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరం విశ్వ నగరంగా అభివృద్ధి చెందిందని రేవంత్ రెడ్డి అన్నారు.

Revanth Reddy spoke at warangal hospital

ఫార్మా రంగం ఎప్పుడు చర్చకు వచ్చిన అందులో హైదరాబాద్ కి స్థానం ఉంటుందని ఆయన అన్నారు. ఇందుకు కారణం ఇందిరా గాంధీ దూరదృష్టి అని ఆయన చెప్పారు రాజీవ్ గాంధీ చొరవతో తెలంగాణలో ఐటీ రంగం రాణించిందని తెలంగాణను మెడికల్ టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. రాష్ట్రంలో ఫార్మా అభివృద్ధికి ఫార్మా విలేజెస్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. శంషాబాద్ లో 1000 ఎకరాల్లో మెడికల్ టూరిజం హబ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం చూస్తున్నట్లు ఆయన అన్నారు. అన్ని రకాల వైద్య సేవలు అందించేలా మెడికల్ టూరిజం ఉండాలని ఆయన అన్నారు.

Also read: ZTE Voyage 3D: Another interesting phone in the market..!

రాష్ట్రంలో ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వ ఆలోచన చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో ఇలా ఉచిత వైద్యం అందించాలని ప్రభుత్వం చూస్తున్నట్లు చెప్పారు. మా ఆలోచన ముందుకు తీసుకెళ్లడానికి సాంకేతికంగా మీ సహాయం కోరుతున్నామని అన్నారు ఆసుపత్రికి ఎంతమందికి వచ్చారని కాదని ఎంతమంది నవ్వుతూ ఆసుపత్రి నుండి బయటికి వెళ్లారు అనేది ముఖ్యమని ఆయన అన్నారు. వైద్యం అందించడం ఒక సామాజిక బాధ్యత అని అన్నారు. డబ్బుల కోణంతో కాదు సేవ చేయాలనే దృక్పథంతో పనిచేయాలని ఈ నగరానికి త్వరలో ఎయిర్పోర్ట్ రాబోతోందని టెక్స్టైల్ పార్కు త్వరలో అందుబాటులోకి రాబోతుందని అన్నారు (Revanth Reddy).