Shivaji: యాక్టర్ శివాజీ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన ఎన్నో సినిమాల్లో చేస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. తాజాగా బిగ్ బాస్ 7 లో పార్టిసిపేట్ చేసి విజయాన్ని అందుకున్నారు. టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మరో భారీ సోషియో ఫాంటసి మూవీ “కూర్మనాయకి”. ఈ చిత్రాన్ని ఎంఎం క్రియేషన్స్, కాలభైరవ ప్రొడక్షన్స్ తో కలిసి రోషన్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో కె విజీతా రావ్ నిర్మిస్తున్నారు. స్నిగ్ధ మణికాంత్ , పూజ సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటిదాకా రానటువంటి కథా కథనాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు హర్షవర్ధన్ కడియాల.

Shivaji finally hit the jackpot

వరలక్ష్మి శరత్ కుమార్, సాయి కుమార్, అతి రారాజ్, వీటీవీ గణేష్ కీ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్రంలో టాలెంటెడ్ యాక్టర్ శివాజీ ఓ ప్రధాన పాత్రను పోషించనన్నారు. ఈరోజు శివాజీ బర్త్డే సందర్భంగా ఆయనను పుట్టినరోజు విషెస్ తో ప్రాజెక్ట్ లోకి వెల్కమ్ చేస్తూ సోషల్ మీడియో రిలీజ్ చేసింది కుర్శనాయకి టిమ్. శివాజీ ఈ చిత్రంలో పవర్ ఫుల్ రోల్ చేస్తున్నట్లు ఈ వీడియో ద్వారా తెలుస్తుంది. మహావిష్ణు అవతారాల్లోని కూర్మావతారం నేపథ్యంలో భారీ పాన్ ఇండియా మూవీగా ” కూర్మనాయకి” చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు హర్షవర్ధన్ కడియాల.

Shivaji finally hit the jackpot

అత్యున్నత సాంకేతిక విలువలతో పాటు హై క్వాలిటి వీఎఫ్ఎక్స్ షాట్స్ ఈ సినిమాకు ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం రెండు షెడ్యూల్స్ చిత్రీకరణ పూర్తి చేసుకున్నారు. థర్డ్ షెడ్యూల్ లో శివాజీ జాయిన్ అయ్యారు. కూర్మనాయకి సినిమాలో ఓ స్టార్ హీరో నటిస్తున్నారు. ఆయన ఎవరనేది త్వరలో వెల్లడించనున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్, శివాజీ, సాయికుమార్, అతిరారాజ్, సప్తగిరి, గెటప్ శ్రీను, మహేశ్ విట్టా, సరయు, శత్రు, వీటివీ గణేష్, రాజా రవీంద్ర, రాజ్ కృష్ణ, తాగుబోతు రమేష్, తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాల్సిందే.