Smart Phones in July: ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. చిన్నపిల్లలు కూడా ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ ని వాడడం మనం చూస్తూనే ఉన్నాం. పిల్లలు, పెద్దవారు ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్స్ కి బాగా అలవాటు పడిపోయి అవి లేకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి.

ఒకప్పుడు స్మార్ట్ ఫోన్స్ ధరలు ఎక్కువగా ఉండటం వల్ల వీటిని కొనుగోలు చేయడానికి ఎవరు పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. కానీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు అతితక్కువ ధరకే రావడం వల్ల ప్రతి ఒక్కరు వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. అయితే కొత్త ఫోన్ లు కొనాలనే ఆలోచనలో ఉన్నవారికి అదిరిపోయే శుభవార్త. వచ్చే నెలలో చాలా ఫోన్లో మార్కెట్లోకి అతి తక్కువ ధరకే రాబోతున్నాయి. ఇక ఈ ఫోన్లు జూలై నెలలో రాబోతున్నట్లు సమాచారం అందుతుంది. అయితే జూలై నెలలో ఏ ఏ ఫోన్లో అందుబాటులోకి వస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. Smart Phones in July

Smart Phones in July

Tecno Spark 20 pro 5G: అనే కంపెనీ ఈ కొత్త ఫోన్ ను జూలైలో ఇండియన్ మార్కెట్లోకి తీసుకురాబోతుంది. ఈ ఫోన్లో 120HZ రిఫ్రెష్ రేటుతో 6.78 అంగుళాల ఫుల్ హెచ్డి డిస్ప్లే అందుబాటులో కలదు. ఇందులో 108 మెగా పిక్సెల్స్ తో మెయిన్ కెమెరాను పొందుపరిచారు. ఈ హ్యాండ్ సెట్ డైమెన్షన్ 6080 ప్రాసెసర్ పై రన్ అవుతోంది. Smart Phones in July

Samsung Galaxy Z Fold 6, Z Flip 6: ఈ సాంసంగ్ ఫోన్ జూలై 10వ తేదీన జరిగే గెలాక్సీ అన్ ప్యాకెడ్ ఈవెంట్ లో విడుదల కాబోతున్నాయి. ఇక ఈ ఫోన్లు జెడ్ ఫ్లిప్ 6లో 4000 ఎంఏహెచ్ బ్యాటరీని, జెడ్ ఫోల్డ్ 6లో 4400 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉన్న ఫోన్లు మార్కెట్ లోకి రాబోతున్నాయి. Smart Phones in July

Also Read: Redmi 13C Mobile: రియల్‌ మీ ఫోన్‌ పై రూ.3 వేల డిస్కౌంట్‌…ధర, ఫీచర్స్ ఇవే !

Oppo Reno 12 Series: ఒప్పో ఫోన్ వచ్చే నెలలో ఇండియన్ మార్కెట్లోకి రాబోతుంది. ఈ సిరీస్లో కంపెనీ రెనో 12, రెనో 12 ప్రో అనే రెండు వేర్వేరు ఫోన్లను విడుదల చేయనుంది. ఇక ఇందులో అనేక AI ఫీచర్లను మనం చూడవచ్చు. ఇందులో 6.7 ఫుల్ HD+OLED డిస్ప్లే అందుబాటులో ఉంది. Smart Phones in July

Honor 200 Series: హానర్ 200 సిరీస్ ఫోన్ కూడా వచ్చే నెలలో విడుదల కాబోతోంది. ఈ ఫోన్లో 50 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు 50 మెగా పిక్సెల్ టెలిఫోటో, ఫోటోగ్రఫీ కోసం 12 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఇందులో హానర్ 200, హానర్ 200 ప్రో అనే రెండు ఫోన్లు అందుబాటులో కలవు. Smart Phones in July