Star director who asked Sobhan Babu for half of the property

Sobhan Babu: తెలుగు ఇండస్ట్రీ సోగ్గాడిగా శోభన్ బాబుకి పేరు ఉంది. అలాంటి ఈ హీరో కేవలం సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవడమే కాదు ఆస్తులు సంపాదించడంలోని దిట్టా.. ఇప్పటివరకు సౌత్ ఇండస్ట్రీలో ఉన్న హీరోలు ఎవరికి కూడా ఈ హీరోకి ఉన్న ఆస్తులు లేవు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈయన అప్పట్లోనే తను సంపాదించిన డబ్బులు ఎంతో పొదుపుగా వాడుకొని ఉన్న డబ్బులు అన్నింటితో ఎకరాలకు ఎకరాలు భూములు స్థలాలు కొని పెట్టుకున్నారు.

Star director who asked Sobhan Babu for half of the property

ఇక అప్పట్లో అవి 5000 కు వస్తే ప్రస్తుతం వాటి విలువ 50 కోట్లు 100 కోట్ల కంటే ఎక్కువగానే ఉన్నాయి. అలా సినిమాల్లోకి వచ్చి ఎన్నో కోట్లు సంపాదించి వచ్చిన డబ్బంతా రియల్ ఎస్టేట్ బిజినెస్ లో పెట్టి చివరికి ధనవంతుడిగా మారిపోయారు శోభన్ బాబు. అంతే కాదు ఈయన చెప్పిన సలహాలు సూచనలు పాటించి మురళీమోహన్ వంటి వాళ్లు కూడా బాగా పైకి వచ్చారు అని ఎన్నో ఇంటర్వ్యూలో వాళ్లే స్వయంగా ఈ విషయాన్నీ బయటపెట్టారు.( Sobhan Babu )

Also Read: Aamani: ఆరు సార్లు అబార్షన్ చేయించుకున్న స్టార్ హీరోయిన్.. ఏం జరిగిందంటే.?

అలాగే తన కొడుకులిద్దర్నీ సినిమాల్లోకి రాకుండా బిజినెస్ రంగంలోనే సెటిల్ చేశారు. అయితే అలాంటి శోభన్ బాబుని ఓ స్టార్ డైరెక్టర్ మీ ఆస్తుల్లో సగం నాకు ఇచ్చేయండి అని అడిగారట. మరి ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు? ఎందుకు శోభన్ బాబు ఆస్తిని రాసి ఇవ్వమన్నారు అనేది ఇప్పుడు చూద్దాం.. శోభన్ బాబు ఆస్తిలో సగభాగం అడిగింది ఎవరో కాదు డైరెక్టర్ కోదండరామిరెడ్డి..

Star director who asked Sobhan Babu for half of the property

అయితే అప్పట్లో ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది మీరు అచ్చం శోభన్ బాబు లాగే ఉన్నారు అని పొగిడేవారట. ఇక ఈ విషయం గురించి ఓ రోజు శోభన్ బాబుతో కోదండరామిరెడ్డి చెబుతూ..నేను మీలాగే ఉన్నాను అని అందరూ అంటున్నారు. మీ ఆస్తిలో నాకు సగభాగం ఇవ్వండి అని అడిగారట.దానికి శోభన్ బాబు దానికేం భాగ్యం ఇస్తాను కానీ నా ఆస్తి మొత్తం నా ఇద్దరు కొడుకుల పేర్ల మీదే రాసేశాను అంటూ చెప్పారట. ఇక ఈ విషయాన్ని కోదండరామిరెడ్డి ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టారు.( Sobhan Babu )