Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘోరంగా ఓడిపోయిన వైసిపి పార్టీకి వరుసగా షాక్ లు తగులుతూనే ఉన్నాయి. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. అంతేకాకుండా నాలుగు ఎంపీలను దక్కించుకున్న వైసిపి పార్టీ… ఏపీలో అధికారాన్ని కోల్పోయింది. అంతేకాకుండా… ఏపీలో ప్రతిపక్ష హోదా కూడా వచ్చేలా కనిపించడం లేదు. Jagan

Tollywood celebrities who are backing Jagan

ఈ తరుణంలో… అధికారంలో ఉన్నన్ని రోజులు… జగన్ వెంట నడిచిన వాళ్ళు ఇప్పుడు పార్టీలు మారుతున్నారు. తాజాగా.. టాలీవుడ్ కమెడియన్, ఏపీ ప్రభుత్వ సలహాదారులు అలీ… వైసిపి పార్టీకి గుడ్ బై చెప్పారు. తాను ఇకపై రాజకీయాల్లో ఉండనని… సినిమాలు చూసుకుంటానని తెలిపారు. తన భవిష్యత్తు… అంధకారంలో పడిపోతుందని భయంతో… వైసీపీని వీడి అలీ వెళ్లిపోయారు. Jagan

Also Read: Jagan: చంద్రబాబుకు షాక్… మోడీ, జగన్ ను ఒకటి చేస్తున్న నవీన్ పట్నాయక్ ?

అయితే ఆలీ బాటలోనే… మరి కొంతమంది టాలీవుడ్ సెలబ్రిటీలు… నడిచే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అందులో మాజీ మంత్రి రోజా కూడా ఉన్నట్లు సమాచారం. బిజెపి పార్టీలోకి వెళ్లేందుకు రోజా చూస్తున్నారట. ఛాన్స్ వచ్చినప్పుడు ఆ పార్టీ లోకి… దూకెందుకు సంసిద్ధమయ్యారట రోజా. కాగా ఇప్పటికే వైసీపీ పార్టీ తరఫున రెండుసార్లు ఎమ్మెల్యే అయిన రోజా… మంత్రి కూడా అవ్వడం జరిగింది. Jagan

ఇప్పుడు పార్టీ అధికారంలో లేకపోవడంతో… ఆమె కూడా జారుకుంటున్నారు. ఇక పోసాని కృష్ణమురళి… కూడా వైసిపి నుంచి బయటికి వెళ్లాలని అనుకుంటున్నారట. ఏ పార్టీతో సంబంధం లేకుండా ఇండివిజువల్ గా ఉండాలని అనుకుంటున్నారట. దీంతో జగన్మోహన్ రెడ్డి ఆందోళన చెందుతున్నారని వార్తలు వస్తున్నాయి. Jagan