Kalki 2: రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో రాణిస్తూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాడు ప్రభాస్. రీసెంట్ గా సలార్ మూవీలో నటించిన బ్లాక్ బస్టర్ హిట్టును అందుకున్నాడు. ఇప్పుడు కల్కి మూవీ రీసెంట్గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. కల్కి సినిమా ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఎన్నో రికార్డులు కొల్లగొట్టింది.

The role of the star actor who will continue in Kalki 2

మరో పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ సక్సెస్ ప్రభాస్ ఖాతాలో పడిపోయింది. నాగ అశ్విన్ డైరెక్షన్ లో వచ్చిన ఈ కల్కి యూనివర్స్ సెకండ్ పార్ట్ కూడా ఇప్పటికే 60 శతం షూటింగ్ కంప్లీట్ చేసుకోగా..త్వరలో దీనిపై మరింత క్లారిటీ ఇస్తామని ప్రకటించారు మేకర్స్. ఏడాదిలోపు సీక్వెల్ తో పలకరిస్తామని ప్రేక్షకులకు హామీ ఇచ్చారు. ఇక అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక లాంటి స్టార్స్ నటించిన మూవీని పాన్ వరల్డ్ గా ప్లాన్ చేశారు. అదే రేంజ్ లో రిలీజ్ చేశారు. అయితే అన్ని కేటగిరి లలో సక్సెస్ అయినా మూవీ మ్యూజిక్ విషయంలో మాత్రం కాస్త డిజప్పాయింట్ చేసిందని రివ్యూస్ వచ్చాయి.

దీంతో సెకండ్ పార్ట్ లో మ్యూజిక్ డైరెక్టర్ ను మార్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సంతోష్ నారాయణ కు బదులు ఆస్కార్ అవార్డు గ్రహిత కీరవాణి వర్క్ చేస్తాడని టాక్. కానీ ప్రస్తుతం ఆయన మహేష్ బాబు- రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నట్లు సమాచారం. ఆ ప్రాజెక్ట్ పూర్తి అయ్యాకే కల్కి సెకండ్ పార్ట్ బాధ్యతలు తీసుకుంటాడని తెలుస్తుంది. జక్కన్న ప్రాజెక్ట్ అంటే ఏళ్లు పడుతుంది. కాబట్టి కీరవాణి ముందు కల్కి సినిమాకు సంగీతం సమకూరుస్తాడా లేక నో చెప్తాడా అనే చర్చ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.