Devara: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతున్న సినిమాలలో దేవర మూవీ కూడా ఒకటి. త్రిబుల్ ఆర్ వంటి బ్లాక్ బస్టర్ అనంతరం జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా ఇది. ఈ క్రమంలోనే ఈ మూవీపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ రెండు భాగాలుగా విడుదల కాబోతుంది.

Crazy update on Tarak's "Devara"

ఇక ప్రస్తుతం ఈ సినిమాలోని బ్యాలెన్స్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సీక్వెన్స్ లో ఎన్టీఆర్ తో పాటు షైన్ టైం చాకో, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ తదితరులు కనిపించనున్నారు. ఇక ఈ షెడ్యూల్ పూర్తి అయ్యాక ఎన్టీఆర్ అండ్ జాన్వి కపూర్ లపై బాలన్స్ సాంగ్ షూట్ కూడా పూర్తి చేస్తే ఇక దేవరపాట్ వన్ టాకీ మొత్తం పూర్తి అవుతున్నట్లు తెలుస్తుంది.

Crazy update on Tarak's "Devara"

కాగా ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. మొత్తానికి దేవరా మూవీ పై రోజు రోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఎన్టీఆర్ లేవరా మూవీ అనంతరం హృతిక్ రోషన్ తో కలిసి మోస్ట్ అవైటెడ్ ఆన్ ఇండియా మల్టీ స్టారర్ మూవీ వార్ 2 లో నటించిన ఉన్నారు.