OnePlus 11R Mobile: ప్రపంచమంతటా స్మార్ట్ ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఈ కాలంలో స్మార్ట్ ఫోన్ లేని వారంటూ ఎవరూ లేరు. స్మార్ట్ ఫోన్లు తక్కువ ధరకే అందుబాటులోకి రావడం వల్ల ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. వివిధ రకాల కంపెనీదారులు కూడా విక్రయాలు జరుపుకోవడానికి స్మార్ట్ ఫోన్ లను తక్కువ ధరకే అందించడంతోపాటు వాటిపై భారీగా డిస్కౌంట్ ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వన్ ప్లస్ 11R ఫోన్ పై భారీగా డిస్కౌంట్ లభిస్తోంది. OnePlus 11R Mobile

Huge Discount On OnePlus 11R Mobile

ఈ ఫోన్ అసలు ధర రూ. 39,999 కాగా, అమెజాన్ లో ఏకంగా 30% డిస్కౌంట్ లో రూ. 27,999కి కొనుగోలు చేసుకోవచ్చు. అంతేకాకుండా అమెజాన్ పే బ్యాలెన్స్ తో కొనుగోలు చేస్తే ఆదనంగా రూ. 839 క్యాష్ బ్యాక్ పొందవచ్చు. అంతేకాకుండా ఈ ఫోన్ ఆఫర్ తో మాత్రమే ఆగిపోలేదు. మన దగ్గర ఉన్న పాత ఫోన్లను ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా కూడా ఈ ఫోన్ పై డిస్కౌంట్ ను పొందవచ్చు. OnePlus 11R Mobile

Also Read: Smart Phones in July: జూలై మాసంలో వచ్చే సరికొత్త ఫోన్స్‌ లిస్ట్‌ ఇదే..రూ. 7 వేలకే ?

మన వద్ద ఉన్న పాత ఫోన్ కండిషన్ ఆధారంగా గరిష్టంగా రూ. 26,000 వరకు డిస్కౌంట్ వస్తోంది. ఇక ఈ ఫోన్లో కెమెరా విషయాలు వస్తే…. 50 మెగా పెక్సెల్స్ తో కూడిన ప్రైమరీ కెమెరాను అమర్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగా పిక్సెల్స్ తో కూడిన ఫ్రంట్ కెమెరాను అమర్చారు. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ తో ఈ ఫోన్ పనిచేస్తుంది. ఇక ఈ ఫోన్ లో 8 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ ను అందించారు. OnePlus 11R Mobile

ఈ ఫోన్లో 6.7 ఇంచెస్ తో కూడిన ఫుల్ హెచ్డి డిస్ప్లేను ఇచ్చారు. 120HZ రిఫ్రెష్ రేట్ 2772*1240 పిక్సెల్స్ రిసల్యూషన్ ను అందించారు. స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ ను తీసుకొచ్చారు. ఇక ఇందులో డ్యూయల్ సిమ్, స్టీరియో స్పీకర్స్ అందుబాటులో కలవు. అంతేకాకుండా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కు ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. 100 వాట్స్ సూపర్ వూక్ చార్జింగ్ కు సపోర్ట్ చేసే 5000ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. OnePlus 11R Mobile