Tasty Teja: తేజ సబ్జా గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. బిగ్బాస్ లో ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాడు. సోషల్ మీడియా ద్వారా బాగా పాపులర్ అయిన వాళ్లలో డేస్టీ తేజ కూడా ఒకడు. ఈ క్రేజ్ తోనే బిగ్ బాస్ హౌజ్ లోకి కంటెంట్ గా అడుగు పెట్టాడు. తన ఆట తీరు, మాటతీరుతో బుల్లితెర ఆడియెన్స్ ను బాగానే అలరించాడు. ఇక బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చాక తోటి కంటెస్టెంట్స్ తో కలిసి వీడియోలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు డేస్టి తేజ. అలాగే కొందరు హీరోలను కూడా ఇంటర్వ్యూలు చేస్తున్నాడు. అతని వీడియోలు సామాజిక మద్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి.

Netizens are firing on Tasty Teja

ఇదే సమయంలో కొన్ని సార్లు నెటిజెన్ల చేతిలో ట్రోలింగ్ కు గురవుతున్నాడు. తాజాగా మరోసారి నటిజన్ల చేతికి చిక్కడు డేస్టీ తేజ. సెలబ్రిటీ అయ్యాక కొంచెం బాధ్యతా యుతంగా నేర్చుకోవాలంటూ సోషల్ మీడియాలో అతనిని కడిగిపాడేస్తున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..శనివారం రాత్రి టి20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఆద్యంతం ఉత్కంఠగా జరిగిన పోరులో టమిండియా సౌతాఫ్రికాను7 పరుగుల తేడాతో ఓడించి విశ్వ విజేతగా నిలిచింది. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ ను చూసేందుకు కోట్లాది మంది టివీలకు అతుక్కుపోయారు. మరికోందరు స్టార్మ్ ఫోన్స్, ల్యాప్ టాప్ లలో మ్యాచ్ ను ఎంజాయ్ చేశారు.

Netizens are firing on Tasty Teja

చాలామంది లాగే బిగ్ బాస్ ఫేమ్ డేస్జి తేజా కూడా టి-20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ను చాలా ఆసక్తిగా చూశాడు. అయితే కారు డ్రైవింగ్ చేస్తూ మ్యాచ్ చూడటం ట్రోలింగ్ కు కారణమైంది. తన కారు స్టీరింగ్ మధ్యలో స్మార్ట్ ఫోన్ పెట్టుకుని మ్యాచ్ చూస్తున్నా వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు తేజ. ఈ వీడియోను చూసిన సెలబ్రిటీలు అతనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెలబ్రిటీ అయ్యాక కాస్త బాధ్యతతో నడుచుకో..అంతగా మ్యాచ్ చూడాలని ఉంటే శుభ్రంగా ఇంటి దగ్గరే చూడచ్చు కదా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ‘లేకపోతే కారు పక్కకు ఆపుకుని మ్యాచ్ చూడొచ్చు కదా..ఇలా డ్రైవింగ్ చేసేటప్పుడు మ్యాచ్ చూడటం ఏమాత్రం సరికాదు’ అంటూ తేజ పై ఫైరవుతున్నారు నేటిజెన్లు.