Sonakshi Sinha carried sandals by her husband

Sonakshi Sinha: బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా.. ఈమధ్యనే తనకంటే వయసులో చిన్నవాడైన జహీర్ ఇక్బాల్ ని ప్రేమించి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. ఇక వీరి పెళ్లి జరుగుతుంది అనుకునే సమయంలో రోజుకొక వైరల్ వార్త నెట్టింట చక్కెర్లు కొట్టింది. ఎందుకంటే ఈ పెళ్లి జరగడం సోనాక్షి సిన్హా తల్లిదండ్రులకు ఇష్టం లేదు. కానీ కూతురి ఇష్టం కాదనలేక తప్పక పెళ్ళికి వచ్చినట్టు తెలుస్తోంది. అలాగే సోనాక్షి సిన్హా జహీర్ ఇక్బాల్ మతాలు వేరే కావడంతో వీరిపై నెట్టింట చాలా ట్రోలింగ్ జరిగింది.

Sonakshi Sinha carried sandals by her husband

అయితే సెలబ్రిటీల విషయంలో మతం, కులం అనేదాన్ని అసలు లెక్కలోకే తీసుకోరు. అలాగే సోనాక్షి సిన్హా హిందు, జహీర్ ముస్లిం కావడంతో పెళ్లయ్యాక మతం మారుతుంది అనే వార్తలు కూడా వినిపించాయి. కానీ పెళ్లయ్యాక మతం మారదని,ఇద్దరి మనసులు కలిసి పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమ పెళ్లిలో మతానికి చోటు లేదు అంటూ సోనాక్షి సిన్హా బావ అంటే జహీర్ ఇక్బాల్ సోదరుడు చెప్పారు. అలాగే వీరి రిసెప్షన్ పార్టీ కూడా ముంబైలో గ్రాండ్ గా జరిగింది.(Sonakshi Sinha)

Also Read: Sobhan Babu: శోభన్ బాబుని సగం ఆస్తి రాసియ్యమన్న స్టార్ డైరెక్టర్.. ఎవరంటే.?

అయితే తాజాగా ఈ హీరోయిన్ తన భర్త పై సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. ఇక ఆ పోస్ట్ చూసినెటిజన్స్ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు ఈ జంటపై ట్రోల్స్ కూడా చేస్తున్నారు. మరి ఇంతకీ సోనాక్షి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఏంటంటే.. సోనాక్షి భర్త జహీర్ ఇక్బాల్ భార్య సోనాక్షి చెప్పులు చేత్తో పట్టుకొని ఉన్న ఫోటో తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.అయితే ఈ ఫోటో నెట్టింట షేర్ చేస్తూ భార్య చెప్పులు మోసేటప్పుడు భార్యపై ఎలాంటి చిరాకు పడకుండానే చెప్పులు పట్టుకున్నాడు.

Sonakshi Sinha carried sandals by her husband

జీవితంలో కరెక్ట్ పర్సన్ దొరికితే లైఫ్ ఇలాగే ఉంటుంది అంటూ ఆ ఫోటో కింద రాస్కొచ్చింది. అయితే ప్రస్తుతం ఈ పోస్ట్ పై ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్స్.. ఇప్పుడు బాగానే ఉంటుంది పోనుపోను తెలుస్తుంది మీ మధ్య ఉన్న సాన్నిహిత్యం అని కొంతమంది కామెంట్ పెడితే,మరి కొంతమందేమో జీవితాంతం నీ భార్య చెప్పులు మోయడానికి సిద్ధంగా ఉండు అని కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈమె పెట్టిన పోస్ట్ మాత్రం నెట్టింట వైరల్ గా మారింది.(Sonakshi Sinha).