Tamannaah is going to tell good news about marriage

Tamannaah: తమన్నా భాటియా…ఇండస్ట్రీలోకి వచ్చాక మిల్కీ బ్యూటీగా పేరుపొందిన ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా తరగని అవకాశాలతో ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. ఈ ముద్దుగుమ్మ కేవలం సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా వరుస ఆఫర్స్ చేజిక్కించుకుంటుంది. ఇక ఈ మధ్యకాలంలో వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ ఇండస్ట్రీలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

Tamannaah is going to tell good news about marriage

అయితే అలాంటి తమన్నా నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.ఈ విషయాన్ని స్వయంగా తమన్నా భాటియా విజయ్ వర్మలే బయటపెట్టారు. అయితే ప్రస్తుతం లవ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్న ఈ జంట త్వరలోనే పెళ్లికి రెడీ అవబోతున్నారట. అయితే గత కొద్ది రోజులుగా తమన్నా పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.(Tamannaah)

Also Read: Jayasudha: జయసుధ పై.. నటుడి అనుచిత వ్యాఖ్యలు..!

కానీ ఈమె పెళ్లి మాత్రం జరగడం లేదు.దాంతో సోషల్ మీడియా వరకే ఈమె పెళ్లి వార్తలు పరిమితం అయిపోయాయి. అయితే ఇప్పటికే వీరి మధ్య రిలేషన్ మొదలై సంవత్సరం పూర్తయిపోయింది. దాంతో ఇంట్లో వాళ్ళు కూడా పెళ్లి చేయాలి అని హడావిడి చేస్తున్నారట. తమన్నా పేరెంట్స్ మాత్రం రిలేషన్ లో ఉన్నది చాలు సినిమాలు పెళ్లయ్యాక కూడా చేసుకోవచ్చు.

Tamannaah is going to tell good news about marriage

ఇన్ని రోజులుగా ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నారు కదా. ఇప్పుడు పెళ్లి చేసుకోని మరింత అర్థం చేసుకోండి అంటూ ఇబ్బంది పెడుతున్నారట. దాంతో తమన్నా కూడా ఇంట్లో ఒత్తిడి మేరకు పెళ్లికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఇక పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ ని త్వరలోనే తమన్నా బయట పెట్టబోతోంది.(Tamannaah)