10th class actress Sunaina who is going to marry Dubai Sheikh

Sunaina: తెలుగు, తమిళ,కన్నడ సినిమాల్లో నటించి తమిళంలో ఎక్కువ గుర్తింపు సంపాదించిన నటి సునయనా అంటే తెలుగు ప్రేక్షకులకు ఎక్కువగా తెలియదు. ఎందుకంటే ఈమె తెలుగులో గుర్తింపు వచ్చే పాత్రలు ఏవి చేయలేదు. కానీ టెన్త్ క్లాస్ మూవీలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. అలాంటి సునయనా తెలుగులో కుమార్ వర్సెస్ కుమారి, మిస్సింగ్,పెళ్లికి ముందు ప్రేమ కథ,టెన్త్ క్లాస్, రాజరాజ చోర వంటి సినిమాల్లో నటించింది.

10th class actress Sunaina who is going to marry Dubai Sheikh

అయితే ఈ ముద్దుగుమ్మ తాజాగా దుబాయ్ షేక్ ని పెళ్లి చేసుకోబోతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇక దుబాయ్ షేక్ అంటే దుబాయ్ షేక్ కాదు ఆయన దుబాయ్ ప్రముఖ యూట్యూబర్… మరి ఇంతకీ సునయన పెళ్లి చేసుకోబోయే ఆ యూట్యూబర్ ఎవరో ఇప్పుడు చూద్దామా.(Sunaina)

Also Read: Ravi Teja: రవితేజ పెళ్లి చేసుకోకపోతే సూసైడ్ చేసుకోవాలనుకున్న హీరోయిన్..?


సునయన పెళ్లి చేసుకోబోయేది ఎవరినో కాదు దుబాయ్ యూట్యూబర్ ఖలీద్ అల్.. ఈయన ఈ మధ్యకాలంలో మమ్ముట్టిని చేసిన ఇంటర్వ్యూ ద్వారా బాగా ఫేమస్ అయిపోయాడు. అయితే రీసెంట్ గానే నటి సునయనా ఎంగేజ్మెంట్ జరిగినట్టు ఒక పోస్ట్ చేసింది.అయితే ఆ పోస్ట్ చేసిన వారం రోజులకే ఖలీద్ అల్ కూడా పోస్ట్ పెట్టాడు. దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వైరలవుతున్నాయి.

10th class actress Sunaina who is going to marry Dubai Sheikh

అలాగే సునయన పెట్టిన పోస్ట్ కి ఖలీద్ అల్ లైక్ కూడా చేశాడు.ఇక సునయనకి ఇది మొదటి పెళ్లి అయినప్పటికీ ఖాలీద్ అల్ కి ఇది రెండో పెళ్లి.ఆయనకి మొదట పెళ్ళై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ గత ఏడాది జూలైలో ఈ జంట విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాతే సునయనతో పెళ్లికి ఒప్పుకోనట్టు తెలుస్తోంది.మరి దుబాయ్ యూట్యూబర్ ఖలీద్ అల్ ని సునయన పెళ్లి చేసుకోబోతున్న వార్తల్లో ఎంత నిజం ఉంది అనేది తెలియాలంటే స్వయంగా సునయనా క్లారిటీ ఇవ్వాల్సిందే అంటున్నారు ఆమె అభిమానులు.( Sunaina )