Aishwarya Rajesh received an offer in Star Hero movie

Aishwarya Rajesh: ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి ఐశ్వర్య రాజేష్ ఒకరు. ఇండస్ట్రీలోనే మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా విజయదేవరకొండ తో ఒక మూవీ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా పేరు వరల్డ్ ఫేమస్ లవర్.ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. కథకు, ప్రాధాన్యం ఉన్న మూవీస్ ఎంచుకుంటూ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఐశ్వర్య రాజేష్ ఒకరు.

చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాల్లో నటించిన ఈ చిన్నది..”కౌసల్య కృష్ణమూర్తి” మూవీతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. తరువాత వరుస అవకాశాలు అందుకుని.’వరల్డ్ ఫేమస్ లవర్, టాక్ జగదీశ్, రిష్లబ్లిక్, వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ..తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో సరసన అవకాశం అందుకున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్..అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఓ సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే.

Aishwarya Rajesh received an offer in Star Hero movie

ఇందులో ఒక హీరోయిన్గా ఇప్పటికే మీనాక్షి చౌదరి ని ఎంపిక చేయగా. తాజాగా ఐశ్వర్య రాజేష్ ను తీసుకున్నట్లు తెలిపాడు డైరెక్టర్. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పలు పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.’ఫుల్ యాక్షన్ నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఇందులో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్ నటించగా..ప్రియురాలిగా మీనాక్షి చౌదరి అలరించనుంది. జూలె 3నుంచి చిత్రీకరణ స్టార్ట్ చేస్తాం. ఈ సినిమాను 2025 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేలా సన్నాహాలు చేస్తున్నాం’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ రాబోతున్న కొత్త మూవీ ఎలా ఉండబోతుందో చూడాల్సిందే.