Did Krishnam Raju want to adopt the star hero's daughter

Krishnam Raju: ఏంటి కృష్ణంరాజు నిజంగానే ఆ హీరో కూతుర్ని దత్తత తీసుకోవాలి అనుకున్నారా.. ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారు.. నిజంగానే ఆ హీరో కూతుర్ని దత్తత తీసుకున్నారా.. మరి ఇంతకీ కృష్ణం రాజు దత్తత తీసుకోవాలనుకున్న ఆ హీరో కూతురు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.. దివంగత నటుడు ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు అంటే అందరికీ తెలుసు. ఈయన కేవలం హీరో గానే కాదు విలన్ పాత్రల్లో కూడా నటించారు.

Did Krishnam Raju want to adopt the star hero’s daughter

అలాంటి కృష్ణంరాజు ఎన్నో సినిమాల్లో నటించి రెబల్ స్టార్ గా పేరుగాంచారు.మరీ ముఖ్యంగా ఈయన చెప్పిన కత్తందుకో జానకి అనే డైలాగ్ ఇప్పటికి కూడా చాలామంది హీరోలు, దర్శకులు తమ సినిమాల్లో వాడుకుంటూ ఉంటారు. ఆ డైలాగ్ అంతా ఫేమస్ అయింది. అయితే అలాంటి కృష్ణంరాజు తన వారసుడిగా తన తమ్ముడి కొడుకు ప్రభాస్ ని ఇండస్ట్రీలోకి తీసుకువచ్చారు.ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా హీరో.. ఇక కృష్ణంరాజు అనారోగ్య సమస్యలతో 2022లో మరణించారు.(Krishnam Raju)

Also Read: Tamannaah: పెళ్లి ఎప్పుడో గుడ్ న్యూస్ చెప్పబోతున్న తమన్నా..!

ఈ విషయం పక్కన పెడితే కృష్ణంరాజుకి మొదట సీతాదేవి అనే అమ్మాయితో పెళ్లి అయినప్పటికీ ఆమె మరణించడంతో శ్యామలా దేవిని పెళ్లి చేసుకున్నాడు.ఇక ఈ జంటకి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు.అయితే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నా కూడా కృష్ణంరాజు మరో హీరో కూతుర్ని దత్తత తీసుకోవాలనుకున్నారట. ఇక ఆ హీరో ఎవరంటే సూపర్ స్టార్ కృష్ణ.. ఈ హీరోకి ఇద్దరు కొడుకులతోపాటు ముగ్గురు కూతుర్లు కూడా ఉన్నారు.

Did Krishnam Raju want to adopt the star hero's daughter

అలా కృష్ణ చిన్న కూతుర్ని కృష్ణంరాజు దత్తత తీసుకోవాలి అనుకున్నారట. ఇదే విషయాన్ని కృష్ణతో చెప్పారట.దానికి కృష్ణ నవ్వుతూ తీసుకోండి అని సమాధానం ఇచ్చారట. అయితే కృష్ణ తో ఉన్న అనుబంధం కారణంగానే కృష్ణంరాజు అలా అడిగారట. అయితే ఈ విషయాన్ని స్వయంగా కృష్ణంరాజు బతికున్న సమయంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.(Krishnam Raju)