Ramanaidu love secrets

Ramanaidu: దగ్గుబాటి రామానాయుడు.. తెలుగు సినీ హిస్టరీలో మూవీ మొగల్ గా రామానాయుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో కూడా చోటు సంపాదించుకున్నాడు. అలాంటి రామానాయుడు తన వారసత్వానికి ఎలాంటి లోటు లేకుండా ఎన్నో వేల కోట్ల ఆస్తులు సంపాదించాడు.రామానాయుడు స్టూడియో ద్వారా ఎంతోమంది కి ఉపాధి కల్పించారు.అలాగే ఈయన నిర్మాతగా చేసే సమయంలో ఎంతోమంది కొత్తవారిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

Ramanaidu love secrets

అలా రామానాయుడు పెద్దకొడుకు సురేష్ బాబు ని తన తర్వాత సినీ రంగంలో వారసుడిగా నిర్మాతని చేసారు. ప్రస్తుతం సురేష్ బాబు ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ లో ఒకరనే సంగతి మనకు తెలిసిందే.అలాగే చిన్న కొడుకు వెంకటేష్ ని సినిమాల్లో స్టార్ హీరోగా నిలబెట్టారు. అలాగే కూతురు దగ్గుబాటి లక్ష్మి ని మొదట నాగార్జునకి ఇచ్చి పెళ్లి చేసినప్పటికీ ఆ వివాహం ఎక్కువ రోజులు కొనసాగలేదు.తర్వాత వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. (Ramanaidu)

Also Read: Kalki 5th day collections: ఐదో రోజు పడిపోయిన కల్కి కలెక్షన్స్.. ఏంటి గురు ఇది..!

అలా ఆయనకు పుట్టిన ముగ్గురు పిల్లల్ని సెటిల్ చేసారు. ఇక నిర్మాణ రంగంలో స్టార్ గా కొనసాగిరామానాయుడు కేవలం సినిమాల్లో నిర్మాతగానే కాదు ఎంతో మంది హీరోయిన్లకు ఫేవరెట్ కూడా నట. ఈయన అచ్చం హీరో కటౌట్ తో ఉండడం కారణంగా చాలామంది అప్పటి హీరోయిన్ లు ఈయనపై మోజు పడేవారట.ఈయన సెట్ లోకి రావడంతోనే హీరోయిన్లందరూ కళ్లప్పగించి ఆయన్నే గుడ్లగూబలా చూసేవారట.

Ramanaidu love secrets

అయితే ఈ విషయం గమనించిన నటి శాంతకుమారి రామానాయుడుతో ఉండే సాన్నిహిత్యంతో ఒరేయ్ నువ్వు కూడా సినిమాల్లోకి హీరోగా రా.. ఈ ముండలంతా నిన్నే చూస్తున్నార్రా సినిమాలో నటించు అంటూ రామానాయుడుని సరదాగా ఆట పట్టించేదట. ఇక ఈ విషయాన్ని రామానాయుడు ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. అలా రామానాయుడు నిర్మాతగానే కాకుండా చాలా మంది హీరోయిన్ల ఫేవరెట్ గా కూడా ఉన్నారు.(Ramanaidu)