Realme C63: ప్రపంచమంతటా స్మార్ట్ ఫోన్ ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ లకు విపరీతంగా అలవాటు పడిపోయి వారు చేసే పనులను కూడా మర్చిపోయేంతగా స్మార్ట్ ఫోన్ లో మునిగి తేలుతున్నారు. స్మార్ట్ ఫోన్లు అతి తక్కువ ధరకే మార్కెట్లోకి రావడం వల్ల ప్రతి ఒక్కరూ వారిని కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. Realme C63

Realme C63 with 45W fast charging, leather finish launched in India at Rs 8,999

ఒక్కొక్కరికి ఒకటికి మించి రెండు స్మార్ట్ ఫోన్లు ఉన్నవారు కూడా ఎందరో ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా రియల్ మీ సంస్థ మరొక ఫోన్ ను అతి తక్కువ ధరకే ఇండియన్ మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. రియల్ మీ C63 అనే పేరుతో ఫోన్ ని తీసుకురాబోపోతుంది. ఈ ఫోన్ అతితక్కువ ధరకే లాంచ్ చేస్తోంది రెడ్ మీ కంపెనీ. రియల్ మీ C63 ఫోన్ ఒక స్టోరేజ్ వేరియంట్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అందులో 4 జిబి ర్యామ్ + 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ధర 8, 999 రూపాయలు మాత్రమే. Realme C63

Also Read: OnePlus 11R Mobile: రూ. 40వేల ఫోన్‌ రూ. 27వేలకే..పూర్తి వివరాలు ఇవే

ఇక ఈ ఫోన్లో 6.74 అంగుళాల ఫుల్ హెచ్డి డిస్ప్లేను అమర్చారు. 90Hz స్క్రీన్ ను, 560 నిట్స్ హైబ్రైట్నెస్ మోడ్ కలిగి ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా రియల్ మీ UIపై రన్ అవుతుంది. ఇందులో 50 ఎంపీ ప్రైమరీ బ్యాక్ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ షూటర్ కలిగి ఉంది. ఈ ఫోన్ లెదర్ బ్లూ, జేడ్ గ్రీన్ అనే రెండు కలర్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇది బలమైన 5000mAh బ్యాటరీ కలదు. ఈ ఫోన్ ని ఒక్కసారి చార్జ్ చేస్తే 24 గంటలు సులభంగా వాడుకోవచ్చు. Realme C63

రియల్ మీ C63 45W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ తో వస్తుంది. రియల్ మీ C63 ఫోన్ లోని బ్యాటరీ ఒక్కసారి చార్జింగ్ పై 38 రోజుల స్టాండ్ బై టైమ్ ను అందజేస్తుందని క్లైమ్ తెలియజేస్తుంది. దీని బరువు 189 గ్రాములు. ఇక ఈ ఫోన్ జులై 3వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు రియల్ మీ డాట్ కామ్ ఫ్లిప్కార్ట్ లో ప్రారంభమవుతుంది. ఇక స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారు జులై 3వ తేదీ వరకు ఆగినట్లయితే అతి తక్కువ ధరకే మంచి స్మార్ట్ ఫోన్ మన సొంతం చేసుకోవచ్చు. Realme C63