Samsung: ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ భారత మార్కెట్లోకి కొత్త లాప్టాప్ లను తీసుకు వచ్చింది గెలాక్సీ బుక్ ఫోర్ అల్ట్రా పేరుతో లాప్టాప్లను లాంచ్ చేసింది. ప్రీమియం మార్కెట్ ను టార్గెట్ చేసుకొని ఈ ల్యాప్టాప్ లను తీసుకురావడం జరిగింది. శాంసంగ్ గెలాక్సీ బుక్ 4 సిరీస్ లో టాప్ మోడల్ గా ఈ లాప్టాప్ ను లాంచ్ చేయడం జరిగింది. ఇక దీని ఫీచర్ల విషయానికి వస్తే శాంసంగ్ గెలాక్సీ బుక్ 4 అల్ట్రా లో 16 ఇంచెస్ తో కూడిన 2880 X1800 పిక్సెల్స్ రిజల్యూషెన్ స్క్రీన్ ఉంది. ఎల్ఈడి టు ఈ డిస్ప్లే అందించారు. 400 నిట పీక్ బ్రైట్నెస్ తో ఈ స్క్రీన్ ని తీసుకొచ్చారు. విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టంతో ఇది పనిచేస్తుంది.

Samsung laptop price is Rs. 3 lakhs

ఇంటర్ కోర్ అల్ట్రా నైన్ సిపియు ప్రాసెసర్ ని ఇచ్చారు. అలాగే మరిన్ని ఫిచ్చర్స్ ని కూడా చూసేస్తే.. ఇందులో 32gb ర్యామ్ అలాగే సూపర్ స్టోరేజ్ తో దీన్ని తీసుకొచ్చారు ఈ ల్యాప్టాప్ లో డాల్బీ అట్మోస్ట్ సపోర్ట్ తో కూడిన క్వాయిడ్ స్పీకర్లు డ్యూయల్ మైక్రోఫోన్ ను అందించారు. ఇందులో థండర్ బోల్ట్ ఫోర్ యు ఎస్ బి టైప్ ఏ పోర్ట్ ను అందించారు.

Also read: Annuity Scheme: ఎస్‌బీఐలో యాన్యూటీ స్కీమ్.. ప్రతి నెలా రూ.11 వేలు..!

ఫుల్ హెచ్డి వెబ్ కామ్ బ్యాక్ లైట్ న్యూమరిక్ కీబోర్డ్ ను కూడా ఇచ్చారు. దీంతో పాటుగా హెచ్డీఎంఐ 2.1 పోర్ట్, కార్డ్స్ స్లాట్ వంటి అధునాతన ఫీచర్లు కూడా ఇచ్చారు. ఇక దీని ధర విషయానికి వస్తే… శాంసంగ్ గెలాక్సీ బుక్ 4 అల్ట్రా 16gb ర్యామ్ సీపీయూ వేరియంట్ ధర వచ్చేసి 2,33,990 అల్ట్రా నైన్ సిపియుతో పాటుగా 32gb ర్యామ్ ధర 2,81,990గా ఉంది లాంచింగ్ ఆఫర్లో భాగంగా కొనుగోలు చేస్తే 12,000 వరకు డిస్కౌంట్ వస్తుంది (Samsung).