Shirish mother's sensational comments on mega family

Shirish: మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ శిరీష్ భరద్వాజ్ ని ప్రేమ పెళ్లి చేసుకొని కూతురు పుట్టాక భర్త వేధిస్తున్నాడని విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.అయితే ఈ మధ్యనే శ్రీజ మొదటి భర్త అనారోగ్య సమస్యల కారణంగా మరణించారు. ఇక ఆ టైంలో శ్రీజ శిరీష్ లకు పుట్టిన కూతురు నివృతి శిరీష్ ని కడసారి చూసేందుకు వెళుతుంది అని అందరూ అనుకున్నారు. అయితే ఈ మ్యాటర్ గురించి ఇప్పటివరకు మీడియాలో ఎక్కువగా వార్తలు రాలేదు. అయితే మొట్టమొదటిసారి శిరీష్ కూతురు తండ్రిని కడసారి చూపు చూడడానికి వచ్చిందో లేదో తెలియజేసింది.

Shirish mother’s sensational comments on mega family

శిరీష్ భరద్వాజ్ తల్లి తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా కొడుకు చనిపోయిన సమయంలో వాడి మరణం పై ఎన్నో రూమర్స్ వినిపించాయి.కానీ అందులో ఎలాంటి నిజం లేదు. ఊపిరితిత్తులు పాడై చనిపోయినట్లు వార్తలు రాశారు. కానీ అసలైన నిజం ఏంటంటే.. దుబాయ్ లో వాడి పుట్టినరోజు వేడుకలను జరుపుకొని తిరిగి ఇండియాకు వచ్చాక కొద్దిరోజులకే అనారోగ్యం పాలయ్యాడు.దాంతో అపోలో హాస్పిటల్లో చేర్పించి మెరుగైన చికిత్స అందించాం.(Shirish )

Also Read: Pawan Kalyan: సినీ, రాజకీయాల్లో తోపైనా పవన్ కి ఆ మహిళను చూస్తే అంత భయమా.?

అయితే దాదాపు 30 రోజులపాటు హాస్పిటల్ లోనే ట్రీట్మెంట్ తీసుకున్నాడు. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ ఓ రోజు సడన్ గా కార్డియాక్ అరెస్టు వచ్చింది.దాంతో నా కొడుకు కన్నుమూశాడు. శిరీష్ మరణించిన విషయాన్ని మెగా ఫ్యామిలీకి సమాచారం అందించాం. కానీ నా కొడుకు చనిపోతే అంత్యక్రియలకు ఎవరూ రాలేదు. కనీసం నా మనవరాలను కూడా తండ్రిని చివరి చూపు చూడ్డానికి పంపించలేదు. ఇక నేను చనిపోయేలోపైన నా మనవరాలిని చూస్తానో లేదో తెలియదు.

Shirish mother's sensational comments on mega family

నా మనవరాలిని చూడాలని నాకు ఎంతగానో ఆశగా ఉంది. నేను పోయేలోపైన వాళ్లు నా మనవరాలిని నాకు చూపిస్తారో లేదో అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది శిరీష్ తల్లి.ప్రస్తుతం శిరీష్ తల్లి చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ గా మారడంతో కొంతమంది మెగా హేటర్స్ తండ్రి చనిపోతే కనీసం చివరి చూపు చూడడానికైనా కూతుర్ని పంపించాలి కదా.. విడాకులు తీసుకుంటే ఏంటి శిరీష్ కి నివృత్తి కూతురు కాదా.. తండ్రిని చూసే హక్కు కూతురికి లేదా అంటూ కొంతమంది మెగా ఫ్యామిలీ పై నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు.(Shirish )