Prabhas is leaving for Europe without the release of Kalki.. Is that the reason

Prabhas: ఈశ్వర్ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ప్రభాస్ అనంతరం విడుదలైన వర్షం మూవీతో మంచి విజయాన్ని అందుకున్నాడు. రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన చత్రపతి మూవీ ప్రభాస్ జీవితాన్నే మార్చేసిందని చెప్పుకోవచ్చు. దీంతో ప్రభాస్ టాలీవుడ్ లో స్టార్ హీరోగా నేలదొక్కుకున్నాడు. ఇక అనంతరం రాజమౌళి తీసిన బాహుబలి మూవీ ప్రభాస్ ని పాన్ ఇండియా లెవెల్ లో హీరోని చేసింది.

కల్కి బ్లాక్ బస్టర్ అవడంతో ప్రభాస్ స్పీడ్ ని మరింత పెంచుకున్నాడు. రెబల్ స్టార్ ఏకంగా 6 ఇండియా సినిమాలే లైన్లో పెట్టాడు. ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన ప్రభాస్ సలార్ మంచి హిట్ అందుకుంది. కాగా ఈ మూవీకి సీక్వెల్ కూడా అతి త్వరలోనే రాబోతుంది. ఇంకోవైపు ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో రాజా సాబ్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ కూడా 50% అయిపోయిందని తెలుస్తుంది.

Prabhas comments

ఇక ఇంకో రెండు నెలల్లో మొత్తం పూర్తికానున్నట్లు సమాచారం. సీతారామం ఫేమ్, హను రాఘవపూడి డైరెక్షన్లో కూడా ఓ సినిమా చేస్తున్నాడు డార్లింగ్. వీటితో పాటు సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో స్పిరిట్ మూవీని ప్రకటించారు. ఇది ప్రీ ప్రొడక్షన్ లో ఉంది. 2025 ఏడాది షూట్ స్టార్ట్ చేస్తారని సందీప్ రెడ్డి వంగ తెలియజేశారు. అలాగే బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్లో కూడా ఓ మూవీ ఉందని గతంలో అనౌన్స్ చేశారు. కల్కి పార్ట్ 2 కూడా 60% షూట్ కంప్లీట్ అయింది. అలా దగ్గర దగ్గరగా 6 పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెట్టాడు డార్లింగ్.