Laptop Heating: ఈరోజుల్లో ప్రతి ఒక్కరు కూడా లాప్టాప్లను ఎక్కువగా వాడుతున్నారు. లాప్టాప్ల వలన మన పనులు ఈజీ అవుతాయి. కంప్యూటర్ వంటి వాటిని మనం ఎక్కడికైనా తీసుకెళ్లడానికి అవ్వదు కానీ లాప్టాప్ ఉంటే ఎక్కడైనా మనం ఈజీగా వర్క్ చేసుకోవడానికి అవుతుంది. లాప్టాప్ పదే పదే వేడెక్కి పోవడం చాలా మంది ఎదుర్కొనే సమస్య. లాప్టాప్ పదేపదే వేడెక్కిపోతున్నట్లయితే ఇలా చేయడం మంచిది. వ్యాపారమైనా చదువులైనా ల్యాప్టాప్ లను ఎప్పుడు కూడా ఉపయోగిస్తూ ఉంటారు. చాలామంది ఇంటి నుండి పనిచేస్తారు దీని కారణంగా లాప్టాప్ల వాడకం పెరిగింది అటువంటి పరిస్థితుల్లో లాప్టాప్ లో ఎక్కువగా ఉపయోగిస్తారు.

Laptop Heating problem causes

వేడెక్కిపోవడం మొదలవుతుంది. అయితే లాప్టాప్ వేడెక్కిపోవడం వెనుక పలు కారణాలు ఉంటాయి. అదేంటో ఇప్పుడు చూద్దాం… ల్యాప్టాప్ వేడెక్కిపోవడానికి గల కారణాలు ఏంటంటే లాప్టాప్ లో వెంటిలేషన్ చాలా ముఖ్యం వేడిని నియంత్రించడానికి లాప్టాప్ లో సిపియు ఫ్యాన్లు ఉంటాయి. ఈ ఫ్యాన్లను ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి ఫ్యాన్ పై దుమ్ము పేరుకుపోవడం వలన లాప్టాప్ లోపల సరైన వెంటిలేషన్ సాధ్యం కాదు. దాని కారణంగా హీట్ ఎక్కిపోతుంది. లాప్టాప్ హార్డ్వేర్ గురించి మీకు సరైన అవగాహన ఉంటే సిపియు కూలింగ్ వ్యవస్థలో పేరుకుపోయిన దుమ్ముని మీరే క్లీన్ చేసుకోవచ్చు. ఎప్పుడు మీ లాప్టాప్ ని ఒరిజినల్ చార్జర్ తో మాత్రమే ఛార్జ్ చేయడానికి ప్రయత్నం చేయండి.

Also read: Whatsapp: వాట్సాప్‌లో బ్లూ-పర్పుల్ రౌండ్ ఆప్షన్‌ ఏమిటి..? దాని లాభాలేంటి..?

వాస్తవానికి ఏదైనా ఇతర కంపెనీ చార్జర్ ని ఉపయోగించినట్లయితే అది అనేక సమస్యలను కలిగిస్తుంది. చాలా మంది లాప్టాప్ లో చార్జర్ ని పూర్తిగా ఛార్జ్ చేసిన తర్వాత కూడా తీసేయరు. మీరు లాప్టాప్ ని నిరంతరం తొమ్మిది గంటల పాటు చార్జ్ లో ఉంచినట్లయితే అది వేడెక్కడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. లాప్టాప్ లో అనవసరమైన యాప్స్ ఉపయోగించద్దు. లాప్టాప్ లో ఒకటి లేదా రెండు కంటే ఎక్కువ విండోస్ ని తెరిచి ఉంచకండి ఇది లాప్టాప్ పని తీరుపై ప్రభావితం చేస్తుంది. ఇలా మీరు ఈ టిప్స్ ని ఫాలో అయ్యారంటే లాప్టాప్ హీట్ ఎక్కిపోకుండా ఉంటుంది. పైగా ఎక్కువ కాలం మన్నుతుంది. బాగా పనిచేస్తుంది. ల్యాప్టాప్ కి ఎలాంటి సమస్యలు కూడా కలగవు (Laptop Heating).