Rebellion of 38 Congress MLAs against Revanth Reddy

Revanth Reddy: తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు సమయం ఖరారు అయింది. నాలుగవ తేదీన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీకి వెళ్లబోతున్నారు. మంత్రివర్గ విస్తరణలో ఎవరికి అవకాశం దక్కుతుంది..? విస్తరణ గురించి ముఖ్య మంత్రి రేవంత్ ఎలాంటి కసరత్తు చేస్తున్నారు..? హై కమాండ్ ఇచ్చిన ఆదేశాలు ఏంటి..? తాజాగా పార్టీ మారిన వాళ్లకి చోటు దక్కుతుందా అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. క్యాబినెట్లో సీఎం సహా 12 మంది మంత్రులు ఉన్నారు అయితే మరో 6 సీట్లు ఖాళీగా ఉన్నాయి.

Revanth Reddy again visiting Delhi

మంత్రివర్గ విస్తరణలో ఈ ఆరు మంత్రి పదవులు భర్తీ కాబోతున్నాయి. ఐదు రోజులు పాటు ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి హై కమాండ్ తో సంప్రదింపులు జరిగి జరిపాక మంత్రివర్గ కూర్పు పై స్పష్టత వచ్చినట్లు సమాచారం. ఖాళీగా ఉన్న ఆరు మంత్లి పదవుల్లో రెండు బీసీలకు ఒకటి ఎస్టీలకు ఇవ్వాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. అయితే ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలనే దాని గురించి మరోసారి ఢిల్లీలో పార్టీ ముఖ్య నేతలతో భేటీ కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు.

Also read: Shirish: నా కొడుకు చనిపోయినా నా మనవరాలిని రానివ్వలే.. మెగా ఫ్యామిలీపై శిరీష్ తల్లి సంచలన కామెంట్స్.?

ఈ నేపథ్యంలో మంత్రి పదవి ఆశించిన వారంతా ఢిల్లీ చుట్టూ సీఎం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రస్తుతం మంత్రివర్గంలో ఉమ్మడి హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి ఉమ్మడి నిజమాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లభించలేదు. మంత్రివర్గ విస్తరణలో నాలుగు ఉమ్మడి జిల్లాలకు తప్పనిసరిగా అవకాశం కల్పించాల్సి ఉంటుంది. సీతక్క హోం మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని ఆసక్తికర అంశం వెల్లడైంది. ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి దానం మంత్రివర్గంలో చోటు తక్కువ ఉందని స్పష్టమవుతోంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒకరికి మంత్రి పదవి వస్తుందని అన్నారు (Revanth Reddy).

Rebellion of 38 Congress MLAs against Revanth Reddy