Telangana: తెలంగాణ రాష్ట్రంలో… అతి త్వరలోనే కేబినెట్ విస్తరణ ఉండబోతుంది. ఇందులో భాగంగానే బుధవారం రోజున ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి మరోసారి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలి… కేబినెట్ విస్తరణలో ఎవరికి ఛాన్స్ ఇవ్వాలి ? అలాగే… డిప్యూటీ స్పీకర్ పవి కోసం ఎవరిని సెలెక్ట్ చేయాలి అనే దానిపై కాంగ్రెస్ అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. Telangana

Revanth Sensation Home Department for Iron Lady Key posts for Pocharam, Rajagopal, Vivek

అంటే దాదాపు ఏడు మందికి… ఈసారి పదవులు రానున్నాయి. ఇందులో ఐదు మందికి తెలంగాణ మంత్రి పదవులు రాబోతున్నాయి. అటు పిసిసి పదవి, ఇటు డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ఒకరికి వరించనుంది. డిప్యూటీ స్పీకర్ పదవి పోచారం శ్రీనివాస్ రెడ్డికి… ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. గతంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పీకర్ గా పనిచేసిన సంగతి తెలిసిందే. ఇటీవల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న పోచారం శ్రీనివాస్ రెడ్డికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారట. Telangana

Read Also: Jagan: ఓటమి బాధలో జగన్… కొత్త లుక్ అదుర్స్ ?

ఇక ఇటు… ఇప్పటికే మంత్రిగా ఉన్న… సీతక్కకు హోం శాఖ పదవి ఇవ్వాలని అనుకుంటున్నారట. ఏపీలో మహిళా కోటాలో అనితకు హోం మంత్రి పదవి వచ్చింది. ఇక ఇక్కడ సీతక్కకు ఇవ్వబోతున్నారట. అటు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి… ఈసారి కేబినెట్లో స్థానం కల్పించబోతున్నారని సమాచారం. అంతేకాకుండా… వి6 ఛానల్ ఓనర్… చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కి కూడా… ఈసారి సీటు కన్ఫర్మ్ అయినట్లు సమాచారం. Telangana

నల్గొండలో… ఉత్తంకుమార్ రెడ్డి వర్సెస్ రాజగోపాల్ రెడ్డి మధ్య వార్ జరుగుతోందట. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే తన భార్యకు కూడా ఇవ్వాలని ఢిల్లీలోనే కూర్చున్నారట ఉత్తంకుమార్ రెడ్డి. ఇటు తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్ష పదవి మహేష్ గౌడ్ కు రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మహేష్ గౌడు కాదనుకుంటే మధుయాష్కి కూడా లైన్లో ఉన్నారు. Telangana