Sri Leela who says she is ready to marry a star hero

Sri Leela: టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీ లీల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పెళ్లి సందడి చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అనంతరం రవితేజ తో ధమాకా అనే సినిమాలో నటించి ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. ఇక ఆ తరువాత వరుస పెట్టి స్టార్ హీరోలతో జతకట్టి సినిమాలు చేస్తూ తనదైన రీతిలో దూసుకుపోయింది. ఇక ఈ మధ్యకాలంలో ఈ బ్యూటీ ఖాతాలో నాలుగు ఫ్లాప్స్ పడడంతో కాస్త అవకాశాలు తగ్గాయి. తన నటన అండ్ డాన్స్ తో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఈ బ్యూటీ.

దీంతో ఈ అమ్మడికి వరుస అవకాశాలు వచ్చి స్టార్ హీరోయిన్ హోదా లభించింది. అప్పట్లో టాలీవుడ్ హీరోలంతా శ్రీ లీలా అని తమ సినిమాలో నటించాలనే బిట్టుపై ఉండేవారు. కానీ ప్రజెంట్ పెద్దగా కలిసి రాకపోవడంతో అవకాశాలు రావడం లేదు. అయినప్పటికీ అడపాదడపా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది ఈ బ్యూటీ. అలాగే సోషల్ మీడియాలోనూ పలు పోస్టులతో అభిమానులు హృదయాలను గెలుచుకుంటుంది. ఇక ప్రస్తుతం శ్రీ లీల మరోసారి రవితేజ సినిమాతోనే తన అదృష్టాన్ని పరిష్కరించుకోబోతుంది.

Sri Leela who says she is ready to marry a star hero

వీరిద్దరి కాంబినేషన్లో ఓ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక దీనికి సంబంధించిన షూటింగ్ కూడా స్టార్ట్ అయినట్లు అధికారిక ప్రకటన కూడా వెల్లుడైంది. అలాగే ఈ అమ్మడు రెండు మూడు చిత్రాల్లో అవకాశాలు అందుకున్నట్లు టాక్. దీంతో ఈమె ఫ్యాన్స్ మళ్లీ స్టార్ హీరోయిన్ అయిపోతుందని భావిస్తున్నారు. ఇక ఈ క్రమంలో తాజాగా శ్రీ లీల పెళ్లి చేసుకోబోతుంది అంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. ఓ స్టార్ హీరో తో పెళ్లికి రెడీ అయినట్లు నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా ఈ ఏడాది పూర్తి అయ్యే లోపే పెళ్లి చేసుకోబోతున్నట్లు టాక్. మరి ఇందులో నిజం ఎంతుందో తెలియదు కానీ ప్రజెంట్ ఇవే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.